రైతులకు వ్యవసాయ శాఖ అధికారులు అందుబాటులో ఉండటంతో పాటు వారికి కావాల్సిన సౌకర్యాలను కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా రైతు వేదికలు నిర్మించింది. నిర్మల్ జిల్లాలో మొదట పూర్తయిన చిట్యాల్ గ్రామంలోని రైతు వేదిక భవనాన్ని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, దేవదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి కలిసి శనివారం ప్రారంభించనున్నారు. అందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు సర్పంచ్ రమేశ్ రెడ్డి తెలిపారు.
గ్రామంలో రైతు వేదిక నిర్మాణం అన్ని హంగులతో నిర్మించారు. వ్యవసాయ విస్తరణాధికారికి ఒక ఛాంబర్, రైతు సమన్వయ సమితి సమన్వయ కర్తకు ఒక ఛాంబర్ నిర్మించారు. పెద్ద హాల్ నిర్మించడంతో పాటు అందులో క్లస్టర్ల పరిధిలోని రైతులు సమావేశం అయ్యేందుకు వీలుగా వసతులు కల్పించారు. ఆహ్లాదకరమైన వాతావరణం కల్పించడానికి వ్యవసాయానికి సంబంధించి వివిధ రకాల బొమ్మలు గీశారు. వేదిక పరిసర ప్రాంతాల్లో విరివిగా మొక్కలు నాటారు.
ఇదీ చదవండి: మాల్‌లో వేధింపులు ఎదుర్కొన్న ప్రముఖ నటి