ETV Bharat / state

నిర్మల్ కోర్టుకు హాజరైన అక్బరుద్దీన్ ఓవైసీ - నిర్మల్​ జిల్లా తాజా వార్త

నిర్మల్​ జిల్లా కోర్టుకు ఎంఐఎం నేత అక్బరుద్దీన్​ ఓవైసీ హాజరయ్యారు. అనారోగ్య కారణాల రీత్యా కేసును హైదరాబాద్​ నాంపల్లి కోర్టుకు బదిలీ చేయాలని ఓవైసీ అభ్యర్థించగా.. తదుపరి విచారణకు నాంపల్లి కోర్టులో హాజరవ్వాలని కోర్టు ఆదేశించింది.

akbharuddin-attend-nirmal-court
నిర్మల్ కోర్టుకు హాజరైన అక్బరుద్దీన్ ఓవైసీ
author img

By

Published : Dec 10, 2019, 3:33 PM IST

నిర్మల్​ జిల్లా కోర్టుకు ఎంఐఎం పక్షనేత అక్బరుద్దీన్​ ఓవైసీ హాజరయ్యారు. 24 డిసెంబరు 2012న నిర్మల్​ పట్టణంలో జరిగిన బహిరంగ సభలో హిందూ దేవతలను కించపరుస్తూ, మత విద్వేషాలను రెచ్చ గొట్టేలా.. విద్వేషపూరిత ప్రసంగం చేసిన కేసులో ఆయన ఈ రోజు కోర్టులో హాజరయ్యారు. ఇదే కేసులో నిర్మల్​కు చెందిన మాజీ మున్సిపల్ వైస్ ఛైర్మన్ అజీంబీన్ యాహియా కూడా కోర్టుకు వచ్చారు.
ఇన్​ఛార్జ్​ జూనియర్ అడిషనల్ జ్యూడీషియల్ ఫస్ట్​క్లాస్ మెజిస్ట్రేట్ జస్టిస్​ రామలింగం ఎదుట హాజరై తన న్యాయవాది సహాయంతో ఓవైసీ వాదనలు వినిపించారు. అనారోగ్య కారణాలరీత్యా కేసును హైదరాబాద్​లోని నాంపల్లి కోర్టుకు బదిలీ చేయాలని అభ్యర్థించారు. ఈ మేరకు కేసును అక్కడి కోర్టుకు బదిలీ చేశారు.
ఓవైసీ కోర్టుకు హాజరవుతున్న వేళ ముందు జాగ్రత్తగా నిర్మల్ కోర్టు వద్ద పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

నిర్మల్ కోర్టుకు హాజరైన అక్బరుద్దీన్ ఓవైసీ

ఇదీ చూడండి: అమ్మ ఒడిని తలపించే ఆ బడి గురించి మీకు తెలుసా?

Intro:TG_ADB_31_10_AKBARODDIN OWAISI_AV_TS10033
నిర్మల్ కోర్టుకు హాజరైన అక్బరుద్దీన్ ఓవైసీ..

నిర్మల్ జిల్లా: డిసెంబరు 24 2012 లో నిర్మల్ పట్టణంలో జరిగిన బహిరంగ సభలో హిందూ దేవి దేవతలను కించపరుస్తూ, మత విద్వేషాలను రెచ్చ గొడుతూ విద్వేషపూరిత ప్రసంగం చేసిన కేసులో నిర్మల్ కోర్టుకు ఎంఐఎం పక్ష నేత, ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ హాజరయ్యారు. ఇదే కేసులో నిర్మల్ కు చెందిన మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ అజీంబీన్ యాహియా సైతం హాజరయ్యారు. ఇన్ఛార్జి జూనియర్ అడిషనల్ జుడిషియల్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ రామలింగం ఎదుట హాజరై తన న్యాయవాది సహాయంతో వాదనలు వినిపించారు. అనారోగ్య కారణాలరీత్యా కేసును హైదరాబాదులోని నాంపల్లి కోర్టుకు బదిలీ చేయాలని అభ్యర్థించారు. ఈ మేరకు కేసును అక్కడి కోర్టుకు బదిలీ చేసారు. తదుపరి విచారణ నిమిత్తం అక్కడి కోర్టులో హాజరు కావాల్సి ఉంటుంది. ఓవైసీ కోర్టుకు హాజరవుతున్న వేళ ముందు జాగ్రత్తగా నిర్మల్ కోర్టు వద్ద పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.Body:నిర్మల్ జిల్లాConclusion:శ్రీనివాస్
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.