నిర్మల్ జిల్లా వ్యాప్తంగా శనివారం 6,265 మందికి టీకా ఇచ్చినట్లు జిల్లా వైద్యాధికారి డాక్టర్ ధనరాజ్ తెలిపారు. జిల్లాలోని 23 ప్రభుత్వ ఆస్పత్రులు, 3 ప్రైవేటు ఆస్పత్రులతో పాటు పలు గ్రామాల్లో ప్రత్యేక శిబిరాల ద్వారా వ్యాక్సినేషన్ కార్యక్రమం నిర్వహించినట్లు వెల్లడించారు.
జిల్లాలో 45-59 ఏళ్ల వారికి 4,904 మందికి, 60 ఏళ్లు పైబడిన 1,324 మందికి, ఫ్రంట్ లైన్ హెల్త్ కేర్ వర్కర్స్ 37 మందికి టీకా ఇచ్చామని వివరించారు. 45 పైబడిన వారు తప్పనిసరిగా కొవిడ్ వ్యాక్సిన్ తీసుకోవాలని కోరారు.
ఇదీ చదవండి: బరువు తగ్గేందుకు రాత్రుళ్లు చపాతీ తింటున్నారా?