ETV Bharat / state

తెలంగాణలో తిరిగి ప్రారంభమైన రాహుల్‌ గాంధీ భారత్‌ జోడో యాత్ర - Rahul Bharat Jodo Yatra updates

Rahul Bharat Jodo Yatra: తెలంగాణలో రాహుల్‌ భారత్‌ జోడో యాత్ర మళ్లీ ప్రారంభమైంది. ఉదయం 6 గంటల సమయంలో నారాయణపేట జిల్లా మక్తల్‌ నుంచి రాహుల్ యాత్ర ప్రారంభించారు. మధ్యలో మక్తల్ పెద్ద చెరువు వద్ద కులనిర్మూలన పోరాట సమితి సభ్యులు, బీడీకార్మికులు, మత్య్సకారులు కలిశారు.

Rahul Bharat Jodo Yatra
Rahul Bharat Jodo Yatra
author img

By

Published : Oct 27, 2022, 8:44 AM IST

Updated : Oct 27, 2022, 9:17 AM IST

Rahul Bharat Jodo Yatra restarted in Telangana: 3 రోజుల విరామం అనంతరం తెలంగాణలో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ భారత్‌ జోడో యాత్ర మళ్లీ మొదలైంది. మక్తల్‌ సమీపంలోని 11/22 కేవీ సబ్‌స్టేషన్‌ నుంచి ఉదయం 6 గంటల సమయంలో పాదయాత్ర మొదలైంది. యాత్రలో పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా పాల్గొన్నారు.

ఉదయం యాత్ర ప్రారంభమైన తరువాత మక్తల్ ట్యాంక్​బండ్ వద్ద బీడీకార్మికులు, కుల నిర్మూలన పోరాట సమితి సభ్యులు, రైతు స్వరాజ్య వేదిక సంఘం నేతలను రాహుల్ గాంధీ కలుసుకున్నారు. మక్తల్‌ పెద్దచెరువు వద్ద మత్స్యకారులు రాహల్‌ను కలిసి.. తాము ఆర్థిక, విద్యారంగాల్లో వెనుకబడ్డామని వివరించారు. తమకు జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు కల్పించాలని విజ్ఞప్తి చేశారు.

ఇవాళ ఉదయం పూట పాదయాత్ర బండ్లగుంటకు చేరుకున్నాక ముగిసింది. భోజన విరామం సమయంలో రైతు సమస్యలపై రాహుల్‌ ముఖాముఖి కార్యక్రమం ఏర్పాటు చేశారు. తిరిగి సాయంత్రం 4 గంటల నుంచి యాత్ర మళ్లీ మొదలవుతుంది. రాత్రికి గుడిగండ్ల వద్ద ముగుస్తుంది. గుడిగండ్ల కూడలి సమావేశంలో రాహుల్‌గాంధీ పాల్గొంటారు. ఇవాళ రాత్రి ఎలిగండ్లలో బస చేస్తారని కాంగ్రెస్ నేతలు తెలిపారు.

ఇవీ చదవండి:

Last Updated : Oct 27, 2022, 9:17 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.