నారాయణపేట జిల్లా మున్సిపల్ ఎన్నికల్లో ప్రధాన పార్టీలు ప్రచారం ముమ్మరం చేశాయి. తెరాస అభ్యర్థులు సంక్షేమ పథకాలు వివరిస్తూ ఓట్లు అభ్యర్థిస్తున్నారు. మరోవైపు భాజపా, కాంగ్రెస్‌లు అధికార పార్టీలపై విమర్శల్నే అస్త్రాలుగా మలుచుకుని ప్రచారం చేస్తున్నాయి.
సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకుని.. నువ్వులు, చక్కెరతో ఓటర్ల నోరు తీపి చేస్తూ ప్రసన్నం చేసుకుంటున్నారు. పురపాలికల్లోని వార్డుల్లో ఒకరి తర్వాత మరొకరు ఓటర్లను ఆకర్షించడానికి విశ్వప్రయత్నాలు చేస్తున్నారు.
- ఇవీ చూడండి: మున్సిపల్ ఎన్నికల ఏకగ్రీవంలో కారు జోరు..