నారాయణపేట జిల్లా మున్సిపల్ కార్యాలయంలో స్థానిక మహిళా సంఘ సభ్యులకు మాస్కూల తయారీపై శిక్షణ కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ హరిచందన ప్రారంభించారు. ఈ సందర్భంగా మహిళలు ఉపాధి పొందాలనే ఉద్దేశంతో కుట్టుమిషన్ పనితో పాటు ప్రత్యేకంగా మాస్కుల తయారీపై శిక్షణ ఇస్తున్నామన్నారు.
హైదరాబాద్కు చెందిన ఓ స్వచ్ఛంద సంస్థ ద్వారా మహిళలకు ఈ శిక్షణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్టు కలెక్టర్ పేర్కొన్నారు. ఇక్కడ నేర్చుకున్న మహిళలు గ్రూపుల ద్వారా మాస్కులు తయారు చేసి ఉపాధి పొందాలన్నారు.
ఇవీ చదవండి...విశాఖ వాసులను వెంటాడుతున్న విషవాయువు...!