వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని నారాయణపేట సీఐ శ్రీకాంత్ రెడ్డి పేర్కొన్నారు. 32వ జాతీయ రోడ్డు భద్రత మాసోత్సవాలను పురస్కరించుకుని పట్టణంలోని వాహనదారులకు వినూత్న రీతిలో అవగాహన కల్పించారు. ప్రమాదాల నివారణకు పాటించాల్సిన పలు జాగ్రత్తల గురించి వివరించారు.
సీటు బెల్టు, హెల్మెట్ వంటి పలు నిబంధనలను పాటించిన వారికి సీఐ.. పువ్వులు, చాక్లెట్లను అందించారు. రోడ్డు ప్రమాదాల నివారణలో వాహనదారులు భాగస్వామ్యం కావాలని కోరారు. లైసెన్స్, ఆర్‌సీతో పాటు ఇన్సూరెన్స్ కలిగి ఉండాలని వివరించారు.
మద్యం సేవించి, ఫోన్ మాట్లాడుతూ వాహనాలు నడపవద్దని సీఐ సూచించారు. ఆటోలలో పరిమితికి మించి ప్రయాణికులను ఎక్కించుకోవద్దని హెచ్చరించారు.
ఇదీ చదవండి: వాహనాలు చోరీ చేస్తున్న ముఠా అరెస్టు