ETV Bharat / state

విద్యుదాఘాతానికి గురైన వారిని పరామర్శించిన కలెక్టర్

దామరగిద్ద మండలం బాపనపల్లి గ్రామంలో విద్యుదాఘాతానికి గురైన బాధితులను నారాయణపేట జిల్లా కలెక్టర్​ పరామర్శించారు. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందగా.. మరో ఇద్దరి పరిస్థితి విషమించింది. మరో 18మంది బాధితులకు జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు.

author img

By

Published : Feb 20, 2021, 1:32 PM IST

collector Hari Chandana visited the victims of the electric shock at the Narayanpet District Government Hospital
విద్యుదాఘాతానికి గురైన వారిని పరామర్శించిన కలెక్టర్

విద్యుదాఘాతానికి గురైన బాధితులను నారాయణపేట జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో పాలనాధికారి హరిచందన పరామర్శించారు. దామరగిద్ద మండలం బాపనపల్లి గ్రామంలో శుక్రవారం విద్యుదాఘాతం ఏర్పడింది. కొత్తగా తయారు చేయించిన ఇనుప రథాన్ని ఆలయానికి తీసుకెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో 22 మంది ప్రమాదానికి గురయ్యారు. అందులో ఇద్దరు మృతి చెందగా.. మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉండడం వల్ల మహబూబ్​నగర్ ఆసుపత్రికి తరలించారు. మిగిలిన 18మంది బాధితులను నారాయణపేట జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

బాధితులను పరామర్శించిన కలెక్టర్.. వారికి ఎలాంటి లోటు జరగకుండా మెరుగైన చికిత్సలు అందించాలని వైద్యులకు సూచించారు. కలెక్టర్ వెంట అదనపు కలెక్టర్ కె.చంద్రారెడ్డి, ఆర్డీఓ శ్రీనివాసులు, సూపరింటెండెంట్ మల్లికార్జున్ తదితరులు ఉన్నారు.

ఇదీ చూడండి: హైదరాబాద్‌, రంగారెడ్డి జిల్లాల వైఎస్‌ అభిమానులతో షర్మిల భేటీ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.