నల్గొండ జిల్లా కేతేపల్లి మండలంలోని మూసీ ప్రాజెక్టు కుడి, ఎడమ కాల్వలకు నీటిని విడుదల చేశారు నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య. రబీ సీజన్లో రైతులు వ్యవసాయం చేసేందుకు సాయంగా ఈ నీటిని విడుదల చేసినట్లు ఆయన తెలిపారు. సాగునీటి అవసరాల నీటిని విడుదల చేయటం చాలా సంతోషంగా ఉందని అన్నదాతలు చెబుతున్నారు. ఈ కార్యక్రమంలో రాజ్యసభ సభ్యులు బడుగుల లింగయ్య యాదవ్, స్థానిక ప్రజా ప్రతి నిధులు, అధికారులు పాల్గొన్నారు.
ఇవీ చూడండి: ఏయ్.. ఛాయ్ చటుక్కునా తాగరా భాయ్..!