నల్గొండ జిల్లా దేవరకొండలో ఆర్టీసీ కార్మికుల సమ్మె 43వ రోజు కొనసాగుతోంది. సమ్మెలో భాగంగా బస్ రోకోకు బయలుదేరిన కార్మికులను ఉదయం నుంచి పోలీసులు అరెస్ట్ చేస్తున్నారు. బస్ డిపో వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేసి బస్సులను యథాతథంగా నడిపిస్తున్నారు. డిపో ముందు ధర్నాకు దిగిన సీపీఐ, సీపీఎం, ఆర్టీసీ కార్మికులను పోలీసులు అడ్డుకోగా ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఆందోళనకారులను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు.
ఇదీ చదవండిః ఆర్టీసీ ఐకాస తగ్గినా.. ప్రభుత్వ స్పందన లేదు..?