ETV Bharat / state

ఓటమి భయంతోనే జానారెడ్డి అలా మాట్లాడారు: బాల్క సుమన్

జనగర్జన సభలో కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి జానారెడ్డి చేసిన వ్యాఖ్యలను ప్రభుత్వ విప్ బాల్క సుమన్ ఖండించారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు రాష్ట్రానికి చేసిన అభివృద్ధి ఏమిటో చెప్పాలని డిమాండ్ చేశారు.

trs-party-oppose-former-minister-jannareddy-news
ఓటమి భయంతోనే జానారెడ్డి అలా మాట్లాడారు: బాల్క సుమన్
author img

By

Published : Mar 28, 2021, 12:28 PM IST

ఓటమి భయంతోనే కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి అనవసరమైన వ్యాఖ్యలు చేస్తున్నారని ప్రభుత్వ విప్​ బాల్కసుమన్ పేర్కొన్నారు. శనివారం జరిగిన జనగర్జన సభలో జానారెడ్డి, కాంగ్రెస్ నాయకులు చేసిన వ్యాఖ్యలను ఆయన ఖండించారు. కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు నెల్లికల్ లిఫ్ట్ విషయంలో ఏమి చేశారని మండిపడ్డారు. పంచాయతీరాజ్​ మంత్రిగా ఉన్నప్పుడు రాష్ట్రంలో రోడ్లు ఎందుకు వేయలేదంటూ ప్రశ్నించారు.

ప్రజలను కలిసి సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు వివిరిస్తూ ఓట్లు అడగడం నేరమా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. పైగా నోటికి వచ్చినట్లు తిట్టి... ఆ తిట్లు మాకు దీవెనలు అనడమేంటి అంటూ మండిపడ్డారు.

ఇదీ చూడండి: 'జానారెడ్డి గెలుపు.. రాష్ట్ర రాజకీయాల్లో మలుపు'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.