తెలంగాణ ప్రభుత్వం ఆరో విడత హరిత హారం కార్యక్రమంలో భాగంగా నల్గొండ జిల్లా నాగార్జునసాగర్ నియోజకవర్గ పరిధిలోని ఎమ్మెల్యే నర్సింహయ్య మొక్కలు నాటారు. అనంతరం కమల నెహ్రూ ఆస్పత్రి, మున్సిపల్, పురపాలక కార్యాలయం ఆవరణలో కూడా మొక్కలు నాటారు.
రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన హరితహారం వల్ల అడవులు పెరిగి వర్షాలు పెరుగుతాయని ఎమ్మెల్యే నర్సింహయ్య తెలిపారు. వర్షాలు కురిస్తే పంటలు బాగా పండుతాయని.. వాతావరణంలో కూడా చాలా మార్పులు వస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. అడవులు అభివృద్ధి చెందితే వన్యప్రాణులకు మంచి జరుగుతుందన్నారు.
ఇవీ చూడండి: హరితహారంలో కేసీఆర్.. నర్సాపూర్ అర్బన్ ఫారెస్ట్ ప్రారంభించిన సీఎం