నల్గొండ, సూర్యాపేట, యాదాద్రి భువనగిరి జిల్లా పరిషత్ ఎన్నికల్లో తెరాస అప్రతిహత విజయ యాత్ర కొనసాగించింది. 71 ఎంపీపీలకు గాను 49 మండలాధ్యక్షులను గెలిపించుకున్న గులాబీ దళం... ఇప్పుడు అన్ని జడ్పీ పీఠాల్ని దక్కించుకుంటోంది. కాంగ్రెస్ కంచుకోటగా ఉన్న నల్గొండజిల్లాలో... ఆ పార్టీకి చెక్ పెడుతూ తెరాస దూసుకుపోతోంది. నల్గొండలో 31 జడ్పీటీసీలుండగా... అందులో తెరాసనే 24 స్థానాల్ని చేజిక్కించుకుంది. కాంగ్రెస్ ఏడు స్థానాలకే పరిమితమైంది. సూర్యాపేటలో 23కు గాను... 19 జడ్పీలు గులాబీ పార్టీ... మిగతా 4స్థానాలను హస్తం పార్టీ గెలుచుకుంది. యాదాద్రి భువనగిరి జిల్లాలో 17 స్థానాలకు ఉండగా 12 జడ్పీలు తెరాస... ఐదింటిలో కాంగ్రెస్ పాగా వేశాయి.
జడ్పీలు వీరే
ఇలా మూడు జిల్లాల్లోనూ అధికార పార్టీ పూర్తి మెజారిటీ రావడం వల్ల ఎలాంటి అస్పష్టతకు తావివ్వకుండానే తెరాస అభ్యర్థులు జడ్పీ పీఠాల్ని అధిష్ఠించబోతున్నారు. నల్గొండ జడ్పీ ఛైర్మన్ గా బండా నరేందర్ రెడ్డి బాధ్యతలు స్వీకరించే అవకాశముంది. అటు సూర్యాపేట నుంచి గుజ్జ దీపిక బరిలో నిలిచారు. యాదాద్రి భువనగిరి జడ్పీ ఛైర్మన్ గాఎలిమినేటి సందీప్ రెడ్డి ఎన్నిక లాంఛనమే కానుంది.
ఇవీ చూడండి: ఏకగ్రీవమే లక్ష్యంగా తెరాస ప్రణాళికలు