ప్రభుత్వం ఇచ్చిన సడలింపు మేరకు దాదాపుగా అన్ని షాపులు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 6 వరకు తెరవొచ్చునని నల్గొండ పురపాలిక మున్సిపల్ కమిషనర్ దేవ్‌సింగ్ తెలిపారు. ఆయా దుకాణాలకు సరి సంఖ్య, బేసి సంఖ్యలను నిర్ణయించారు. ఒకరోజు సరి సంఖ్య కేటాయించిన షాపులు తెరుచుకోగా... మరో రోజు బేసి సంఖ్య కేటాయింపు జరిగిన దుకాణాలు తెరుచుకుంటాయని వివరించారు.
స్కూల్స్, కాలేజీలు, కోచింగ్ సెంటర్లు, రెస్టారెంట్, దాబా, జిమ్స్, సినిమా హాల్స్, షాపింగ్ మాల్, స్విమ్మింగ్ పూల్స్, టిఫిన్, హోటల్స్ తదితరాలు తెరవకూడదని స్పష్టం చేశారు. ప్రభుత్వం నుంచి తదుపరి ఆదేశాలు వచ్చేంతవరకు యథావిధిిగా లాక్డౌన్ పాటించాలని ఆయన సూచించారు. ప్రభుత్వ ఆదేశాలను ఉల్లంఘిస్తే చట్టరీత్య కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.