ETV Bharat / state

'సమీకృత వ్యవసాయంలో రాణిస్తున్న మువ్వ రామారావు' - నల్గోండ జిల్లా వార్తలు

Muvva Rama Rao Integrated Farming In Nalgonda : ఆయనోక వైద్యుడు కానీ వ్యవసాయంపై మక్కువతో సాగురంగంలోకి దిగారు. వైద్యవృత్తిని కొనసాగిస్తూనే సమీకృత వ్యవసాయం వైపు అడుగులు వేశారు. ఆటుపోట్లను ఎదుర్కొని అంచెలంచెలుగా వృద్ధి సాధించారు. అసలు సమీకృత వ్యవసాయం అంటే ఏంటి? దాని వలన కలిగే ప్రయోజనాలు ఎంటి? ఆయన ఏ విధంగా ఈ రంగంలో రాణించారో ఇప్పుడు తెలుసుకుందాం.

Muvva Rama Rao Integrated Farming
Muvva Rama Rao
author img

By ETV Bharat Telangana Team

Published : Dec 11, 2023, 5:02 PM IST

'సమీకృత వ్యవసాయంలో రాణిస్తున్న మువ్వరామారావు'

Muvva Rama Rao Integrated Farming In Nalgonda : ఆయనో వైద్యుడు నెలవారి సంపాదన లక్షల్లో ఉంటుంది అయినా ఏదో వెలితి వ్యవసాయంపై మక్కువతో రైతుగా మారారు. వ్యవసాయంలో ఆధునిక సాంకేతికను జోడించి సమీకృత వ్యవసాయం చెపట్టారు. ఏడాది పొడవునా పలు పంటలు అనుబంధ రంగాల నుండి దిగుబడులు తీసేందుకు సిద్ధం అయ్యారు. వ్యవసాయం అంటే వరి ఒక్కటి కాదు, మూస పద్ధతి అంతకన్నా కాదు తీరొక్క పంటల మేళవింపు ఇది అనుభవుజ్ఞులైనా రైతులు చెప్పే మాట అంది వచ్చిన అవకాశాన్ని సద్వివినియోగం చేస్తే అన్నదాతకు కష్టాల ఊసే ఉండదు. సమీకృత వ్యవసాయం అంటే చిన్న కమతం నుంచి కూడా ఒకటికి నాలుగు విధాలుగా ఆదాయం వచ్చే విధంగా కృషి చేయడం.

Young Farmer Mohammad Adeeb Ahmed Success Story : ఉద్యోగం వదిలేశాడు.. సాగులో లక్షలు సంపాదిస్తున్నాడు..

Muvva RamaRao Integrated Farming : నల్గొండ జిల్లా హాలీయా మండలం చింతగూడేనికి చెందిన మువ్వ రామారావు ప్రముఖ వైద్యుడు. వ్యవసాయ కుటుంబంలో జన్మించిన ఆయనకు సాగుపై మక్కువ ఎక్కువ. ఓ వైపు వైద్యవృతిని కొనసాగిస్తూనే వ్యవసాయంలోకి అడుగుపెట్టారు. త్రిపురారం మండలం దుగ్గేపల్లిలో 40 ఎకరాల భూమిని కోనుగోలు చేసి వివిధ పంటలు వేశారు. ప్రకృతి వైపరిత్యాలు, వాతావరణ ప్రభావంతో ఆశించిన మేర లాభం రాలేదు. ఇలాంటి పరిస్థితుల్లో పూర్తిగా పంటల సాగుపైనే ఆధారపడకుండా అనుబంధ రంగాలైన పశుపోషణ, గొర్రెలు, కోళ్ళ పెంపకాలను జోడిస్తే వివిధ రూపాలలో ఆదాయం సమకూరే అవకాశం ఉందని భావించారు. ఈ క్రమంలోనే సమీకృత వ్యవసాయంను(Integrated Farming) ప్రారంభించారు.

"నాకు వ్యవసాయం అంటే చాలా మక్కువ. వ్యవసాయాన్ని అభివృద్ధి చేసి తోటి వారికి రోల్​ మోడల్​ నిలవాలని నా ఆకాంక్ష. వ్యవసాయం లాభదాయకమే దాన్ని శాస్త్రీయ పద్ధతి ద్వారా దీనికి అనుబంధంగా కోళ్లను, మేకలను పెంచితే రెండు రకాలుగా లాభం పొందుతున్నాను. నా దగ్గర 80 ఆవులు, 20 గేదేలు, 800 గొర్రెలు ఉన్నాయి. ప్రతిరోజు పశువులు 200లీ దాకా పాలు ఇస్తాయి. కేంద్ర ప్రభుత్వం 50 శాతం స్వంతంగా 50 శాతం నిధులతో ఎలివేటెడ్​ షెడ్డ్​ను రూపొందించాను. పశుసంపదతో వచ్చే ఎరువును పామ్​ఆయిల్​లో ఉపయోగిస్తాను. దీని ద్వారా తోటి రైతులకు ఉపాధి కల్పిస్తున్నాను."-డా. మువ్వ రామారావు, రైతు

ఆకుకూరల డాక్టర్.. ఏం తింటే ఏం లాభమో ఇట్టే చెప్పే పెద్దాయన.. 50 రకాలు సాగు

సమీకృత వ్యవసాయంలో రాణిస్తున్న రామారావు : సమీకృత వ్యవసాయంలో భాగంగా గొర్రెలు, ఆవులు, కోళ్ల కోసం ప్రత్యేకంగా షేడ్‌లు నిర్మించారు. వాటి ద్వారా వచ్చే వ్యర్థాలను పక్కనే పెంచుతున్న ఆయిల్ ఫామ్‌లో కంపోస్టుగా వాడుతున్నారు. దానివల్ల పంట దిగుబడి రెట్టింపు రావడంతో పాటు పలువురికి ఉపాధి కల్పిస్తున్నట్లు రామారావు చెబుతున్నారు. తోటి రైతులకు ఆదర్శంగా ఉంటూ సమీకృత వ్యవసాయంపై లాభాలు పోందడంతో పాటు మరికొందరికి ఉపాధి కల్పించవచ్చని రామారావు అంటున్నారు.

3500 మంది రైతులకు శిక్షణ.. 200 రకాల విత్తనాల ఉత్పత్తి.. అందుకే 'ఆమె'కు పద్మశ్రీ!

KTR Tweet on Telangana Agriculture : 'వ్యవసాయం దండుగ అన్నచోటే.. పండుగైంది'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.