మద్యం, డబ్బులు పంచకుండా తెరాస, భాజపా, కాంగ్రెస్‌లు ఎన్నికల్లో పోటీ చేస్తాయీ అని మహజన సోషలిస్టు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ ప్రశ్నించారు. ప్రజలకు ఏం చేశారో చెప్పాకే సాగర్ ఉపఎన్నిక బరిలో నిలవాలని సవాలు విసిరారు. నల్గొండ జిల్లా హాలియాలో పార్టీ జెండాను ఆయన ఆవిష్కరించారు.
ప్రజలను ఎన్నికల్లో ప్రలోభాలకు గురి చేయమని దేవతల మీద ప్రమాణం చేయగలరా అని మందకృష్ణ ప్రశ్నించారు. ఏం అభివృద్ధి పనులు చేశారో ప్రజలకు చెప్పి పోటీ చేసే పార్టీలు ఉన్నాయా అని వ్యాఖ్యానించారు. సాగర్ ఉపఎన్నికకు త్వరలోనే మహజన సోషలిస్టు పార్టీ అభ్యర్థిని వెల్లడిస్తామని స్పష్టం చేశారు.