లాక్‌డౌన్ కారణంగా ప్రజలు ఎలాంటి ఇబ్బందులు పడకుండా ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటోందని విద్యుత్‌శాఖ మంత్రి జగదీష్‌రెడ్డి అన్నారు. నల్గొండ జిల్లాలో ప్రజలకు నిత్యావసర సేవలు అందించేందుకు మున్సిపల్ అధికారులు రూపొందించిన 'మీకోసం' యాప్‌ను ఆయన ప్రారంభించారు.
కరోనా పాజిటివ్ కేసులు నమోదైన ప్రాంతాలకు ఈ యాప్ ఉపయోగపడుతుందని మంత్రి తెలిపారు. అనంతరం నల్గొండ క్లాక్‌టవర్ సెంటర్‌లో సోడియం హైడ్రోక్లోరైట్ ద్రావణాన్ని స్ప్రే చేసే యంత్రాన్ని ప్రారంభించారు. ప్రజలందరూ భౌతిక దూరం పాటించి కరోనాను తరిమికొట్టాలని జగదీష్ రెడ్డి విజ్ఞప్తి చేశారు.
ఇదీ చదవండి: మంచినీళ్లు అనుకుని శానిటైజర్ తాగేసిన డీహెంచ్వో