ETV Bharat / state

కంది రైతుల ఎదురుచూపులు - నగదు జమ కాక కంది రైతుల కష్టాలు

విత్తు నాటిన దగ్గర నుంచి పంట దిగుబడి అమ్ముకునే వరకూ రైతులకు అడుగడుగునా కష్టాలే. అమ్ముకున్నాక కూడా డబ్బులు అందక అధికారుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. మార్చిలో మార్క్‌ఫెడ్‌, ఎఫ్‌సీఐ ఆధ్వర్యంలోని కొనుగోలు కేంద్రాల్లో కందులు విక్రయించినా ఇప్పటికీ కొంతమందికి డబ్బులు అందలేదు.

kandi farmers are waiting to credit money of their crop after selling
కంది రైతుల ఎదురుచూపులు
author img

By

Published : May 17, 2020, 9:40 AM IST

ఉమ్మడి నల్గొండ జిల్లాలో సుమారు 1,32,187 క్వింటాళ్ల ధాన్యాన్ని మార్క్‌ఫెడ్‌, ఎఫ్‌సీఐ ఆధ్వర్యంలో కొనుగోలు చేశారు. వాటికి సంబంధించి రూ. 39.02 కోట్లు రైతులకు చెల్లించగా ఇంకా రూ.38.06 కోట్లు చెల్లించాల్సి ఉంది. లాక్‌డౌన్‌ సమయంలో ధాన్యం కొనుగోళ్లు, చెల్లింపులు సత్వరమే జరుగుతున్నా కంది రైతులకు మాత్రం బకాయిలు ఇంకా అందకపోవటం గమనార్హం.

పెట్టుబడులకు ఇక్కట్లు

మరో రెండు, మూడు వారాల్లో వానాకాలం పంటల పనులు మొదలవుతాయి. దుక్కులు దున్నడం, విత్తనాలు సమకూర్చుకోవడం, కూలీలకు చెల్లింపులు జరిపేందుకు డబ్బులు అవసరమవుతాయి. ప్రభుత్వం కందులకు సంబంధించిన నగదును చెల్లిస్తే అప్పులు పోగా మిగిలిన నగదును పెట్టుబడులకు వినియోగించుకునేందుకు దోహదపడుతుందని రైతులు యోచిస్తున్నారు.

త్వరలోనే చెల్లిస్తాం

కందుల కొనుగోలుకు సంబంధించి ఇప్పటికే 50 శాతం బకాయిలు చెల్లించాం. మిగిలిన బకాయిలను త్వరలోనే చెల్లిస్తాం. రైతులు ఆందోళన చెందవద్ధు నేరుగా బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తాం.

-వెంకట్‌రెడ్డి, డీసీవో, యాదాద్రిభువనగిరి జిల్లా

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.