నల్గొండ జిల్లా మునుగోడు పట్టణంలో చేనేత కార్మికులు భిక్షాటన చేశారు. కరోనా ప్రభావం వల్ల సుమారు నాలుగు నెలలుగా ఉపాధి లేక ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని... ప్రభుత్వం స్పందించి చేనేత రంగానికి అండగా ఉండాలని విజ్ఞప్తి చేశారు. పట్టణంలోని చేనేత ఐక్య కార్యాచరణ సమితి ఆధ్వర్యంలో భిక్షాటన చేశారు.
పనుల్లేక పస్తులండాల్సిన పరిస్థితి దాపరించిందని... రెక్కాడితే గాని డొక్కాడని చేనేత కుటుంబాలకు ఆకలి కేకలే దిక్కయ్యాయని వాపోయారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి కష్టకాలంలో చేనేత రంగానికి అండగా ఉండాలని విజ్ఞప్తి చేశారు. నిలిచిపోయిన వస్త్ర నిల్వలను ప్రభుత్వం కొనుగోలు చేయాలని... జీఎస్టీని తొలగించి జీవన భృతి కల్పించాలని కోరారు.
ఇదీ చూడండి: రాష్ట్రంలో 60 వేల మార్కును దాటిన కరోనా కేసులు