నల్గొండ జిల్లా నాంపల్లి మండలంలోని ఐకేపీ కొనుగోలు కేంద్రాల్లో పోసిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని… సోమవారం రోజు నాంపల్లి మార్కెట్ యార్డు ముందు రైతులు ఆందోళన నిర్వహించారు. గన్ని బ్యాగులు కావాలని, కంటా చేసిన ధాన్యం బస్తాలను వెంటనే లారీల ద్వారా మిల్లులకు తరలించి.. ధాన్యం దిగుమతి చేసుకోవాలని డిమాండ్ చేశారు.
నాంపల్లి మండలంలోని నాంపల్లి, పసునూరు, మెల్లవాయి గ్రామాల్లో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఆ కొనుగోలు కేంద్రాల్లో దాదాపు 500 మంది రైతులు వరి ధాన్యం కుప్పలు పోశారు. కంటా వేసిన బస్తాలు కుప్పలుగా పేరుకు పోయాయి. దాదాపు 10 వేల బ్యాగులు తూకం చేసి ఉండగా.. రైతులు పోసిన ధాన్యం కుప్పలు 500 వరకు ఉన్నాయి.
అంతేకాదు నాంపల్లి, పసునూరు, మెల్లవాయి కేంద్రాల్లో 9,500 బ్యాగులు తూకం వేసి ఉండగా… గన్ని బ్యాగులు లేక గత మూడు రోజుల నుంచి కొనుగోలు కేంద్రాలు మూతపడి ఉన్నాయి. దీంతో రైతులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి 30 వేల గన్ని బ్యాగులు, 20 లారీలను పంపించాలని సింగిల్ విండో ఛైర్మన్ గట్టుపల్లి నర్సిరెడ్డి ఈ సందర్భంగా కోరారు.
ఇదీ చూడండి: సేంద్రియ సేద్యంతోనే కల్తీలేని ఆహారం: నిరంజన్‌రెడ్డి