ETV Bharat / state

కందులు అమ్ముకోవాలంటే కష్టాలు తప్పవా..! - Farmers have struggle to sell the Toordal crop

మొన్న వరి, నిన్న పత్తి, నేడు కందులు.. ఇలా ఏ పంటను అమ్ముకోవాలన్నా అన్నదాతలకు కష్టాలు తప్పడంలేదు. నల్గొండలో కందులు అమ్మేందుకు మార్కెట్​కు తీసుకెళ్తే టోకెన్లని, బస్తాలు లేవని.. కర్షకున్ని కష్టాల్లో ముంచుతున్నారు.

Farmers have struggle to sell the Toordal crop
కందులు అమ్మాలంటే కర్షకులకు తప్పని కష్టాలు
author img

By

Published : Mar 12, 2020, 1:34 PM IST

నల్గొండ జిల్లాలోని ఎస్ఎల్​బీసీ బత్తాయి మార్కెట్​లో మార్క్​ఫెడ్ సహకారంతో కందుల కొనుగోలు కేంద్రాన్ని ఫిబ్రవరి 26న కందుల కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. కానీ..ఇప్పటివరకు 17,500 క్వింటాళ్ల కందులు కొనుగోలు చేశారు. గతవారం రోజులుగా కొనుగోళ్లు జరగట్లేదని.. టోకెన్లు, గోనె సంచుల సాకుతో మార్కెట్​ చుట్టూ తిప్పుకుంటున్నారని రైతులు మార్కెట్​ ముందు ధర్నాకు దిగారు. ఈ ఏడాది వర్షాలు అధికంగా పడినందున కందులు అంతగా పండలేదని.. పండిన కొంచెం పంటను అమ్మకుందామంటే నిబంధనల పేరిట ఆలస్యం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

కందులు అమ్మాలంటే కర్షకులకు తప్పని కష్టాలు

మార్కెట్​ కంటే దళారులే మేలేమో!

మిర్యాలగూడ, మునుగోడు, తిప్పర్తి, చిట్యాల, నార్కట్​పల్లి మండలాల నుంచి రైతులు కందులు తీసుకువస్తున్నారు. మార్కెట్​ బంద్​ ఉంటే అధికారులు ముందు రోజు తెలియజేయాలని వారు కోరుతున్నారు. ఛార్జీలు, తిండి ఖర్చులు.. రోజుకు రూ. 500 అవుతోందని అన్నదాతలు వాపోతున్నారు.

ఇలా మార్కెట్​కి​ రావడం పోవడం కంటే ఇంటి వద్దనున్న దళారులకే అమ్ముకుంటామని కొందరు రైతులు చెబుతున్నారు.

ఆరుగాలం పండించిన పంటలను అమ్మడానికి రైతులు ఎలాంటి ఇబ్బందులు పడాల్సిన పనిలేదని ప్రభుత్వం చెబుతోంది. కానీ పంట పండించడం ఒకెత్తయితే.. దాన్ని అమ్మడం మరో ఎత్తు అవుతోందని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఇదీ చదవండిః కరోనా నుంచి కాపాడుకోండిలా!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.