ETV Bharat / state

CM KCR Election Campaign in Joint Nalgonda Today : ప్రచారంలో బీఆర్ఎస్ దూకుడు.. నేడు ఉమ్మడి నల్గొండ జిల్లాలో కేసీఆర్ సభలు - BRS Praja Ashirwada Sabhas Latest News

CM KCR Election Campaign in Joint Nalgonda Today : ఉమ్మడి నల్గొండ జిల్లాలో భారత రాష్ట్ర సమితి ప్రచార జోరు మరింత పెంచింది. ఇప్పటికే ప్రచార పర్వంలో ముందున్న అభ్యర్థులు, పార్టీ శ్రేణుల్లో మరింత ఉత్తేజం నింపడమే లక్ష్యంగా గులాబీ అధినేత, సీఎం కేసీఆర్ రంగంలోకి దిగారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇవాళ కోదాడ, తుంగతుర్తి, ఆలేరు నియోజకవర్గాల్లో నిర్వహించే ప్రజా ఆశీర్వాద సభల్లో పాల్గొని ఆయా ఎమ్మెల్యేలకు మద్దతుగా ప్రచారం నిర్వహించనున్నారు. సభలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పార్టీ నేతలు భారీ జనసమీకరణలో తలమునకలయ్యారు.

KCR
KCR
author img

By ETV Bharat Telangana Team

Published : Oct 29, 2023, 7:12 AM IST

CM KCR Election Campaign Today ప్రచారంలో బీఆర్ఎస్ దూకుడు

CM KCR Election Campaign in Joint Nalgonda Today : అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో దూకుడు చూపిస్తున్న గులాబీ దళపతి కేసీఆర్ (KCR).. ఇవాళ ఉమ్మడి నల్గొండ జిల్లాలో మూడు సభల్లో పాల్గొననున్నారు. ముఖ్యమంత్రి సభలను ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న గులాబీ శ్రేణులు దిగ్విజయం చేయాలన్న సంకల్పంతో భారీ ఏర్పాట్లు చేశారు. కోదాడ నియోజకవర్గంలో నిర్వహించనున్న బహిరంగ సభకు సుమారు 70,000 మంది జనం వస్తారని ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ తెలిపారు.

CM KCR Speech at Sircilla Public Meeting : 'ధరణి ఉండాలో.. రద్దు కావాలో ప్రజలే నిర్ణయించుకోవాలి'

CM KCR Election Campaign in Kodada : ఎన్నికల పరిశీలకులు తక్కెళ్ళపల్లి రవీందర్‌తో కలిసి సభాప్రాంగణంలో ఏర్పాట్లను బొల్లం మల్లయ్య యాదవ్‌ (Bollam Mallaiah Yadav) పరిశీలించారు. సభావేదికతో పాటు నాయకులు, కార్యకర్తలు కోసం ప్రత్యేక గ్యాలరీలు ఏర్పాటు చేశారు. నియోజకవర్గ అభివృద్ధికి సంబంధించి సభా వేదికపై కేసీఆర్ పలు అంశాలను ప్రస్తావిస్తారని చెప్పారు. ఈ క్రమంలోనే సంక్షేమ పథకాలు ప్రజలకు చేరకుండా.. కాంగ్రెస్ ఎంపీ ఉత్తమ్‌కుమార్ రెడ్డి అడ్డుకోవడం దారుణమని అన్నారు. అభివృద్ధిని అడ్డుకుంటున్న కాంగ్రెస్ పార్టీని ప్రజలు మరోసారి తిరస్కరించాలని బొల్లం మల్లయ్య యాదవ్‌ కోరారు.

CM KCR Speech at Jangaon Praja Ashirwada Sabha : 'ఓటు మన తలరాతను మార్చేస్తుంది.. ఎన్నికలప్పుడు వచ్చి ఆపద మొక్కులు మొక్కేవారిని నమ్మొద్దు'

CM KCR Election Campaign in Tungaturthi : కోదాడ సభ అనంతరం తుంగతుర్తి నియోజకవర్గం తిరుమలగిరిలో జరిగే ప్రజా ఆశీర్వాద సభలో కేసీఆర్ పాల్గొని ప్రసంగిస్తారు. సూర్యాపేట – జనగామ రహదారి పక్కన జరిగే సభకు సుమారు 50,000 మంది ప్రజలు పాల్గొంటారని ఎమ్మెల్యే గాదరి కిశోర్ కుమార్ (Gadari Kishore Kumar) తెలిపారు. సభకు హజరయ్యే నాయకులు, కార్యకర్తలు, అభిమానుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు ఆయన పేర్కొన్నారు.

"సభకు సుమారు 50,000 మంది ప్రజలు వస్తారని అంచనావేస్తున్నాం. పదిసంవత్సరాలు ఈ నియోజకవర్గంలో గులాబీజెండా ఎగిరింది. మూడోసారి నాకు ఎమ్మెల్యే అయ్యే అవకాశం ఇవ్వాలని ప్రజలను కోరుతున్నాను. మూడోసారి ముఖ్యమంత్రిగా కేసీఆర్‌ అవుతారు." - గాదరి కిశోర్‌ కుమార్‌, తుంగతుర్తి ఎమ్మెల్యే

Telangana Assembly Elections 2023 : కోదాడ, తుంగతుర్తి సభల అనంతరం చివరిగా ఆలేరు నియోజకవర్గంలో నిర్వహించే ప్రజా ఆశీర్వాద సభలో కేసీఆర్ పాల్గొంటారు. సభాస్థలిని స్థానిక ఎమ్మెల్యే గొంగిడి సునీత (Gongidi Sunitha) ముఖ్య నాయకులతో కలిసి పరిశీలించారు. ఇండోర్‌ స్టేడియం పక్కన 22 ఎకరాల్లో సభా ప్రాంగణం ఏర్పాటు చేశామని.. ప్రాంగణం పేరు ఆరుట్ల ప్రాంగణంగా నామకరణం చేశామన్నారు. దాదాపు లక్ష మంది ప్రజలు పాల్గొనేందుకు వీలుగా తగిన ఏర్పాట్లు చేశామని.. సభకు వచ్చేవారికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తగిన సౌకర్యాలు కల్పించినట్లు ఆమె చెప్పారు.

"దాదాపు లక్షమందికి పైగా వస్తారని అంచనా వేస్తున్నాం. ప్రజలు పాల్గొనేందుకు వీలుగా తగిన ఏర్పాట్లు చేశాం. సభకు వచ్చేవారికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశాం." - గొంగిడి సునీత, ఆలేరు ఎమ్మెల్యే

కేసీఆర్ ఎన్నికల ప్రచార సభలతో అభ్యర్థులు, కార్యకర్తల్లో నూతన ఉత్సాహం నెలకొననుంది. రానున్న ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలుపు ఖాయమని గులాబీ శ్రేణులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.

CM KCR Bhuvanagiri Public Meeting Speech : 'కాంగ్రెస్‌ ప్రభుత్వం వస్తే.. ధరణి పోయి మళ్లీ దళారుల రాజ్యం వస్తుంది'

CM KCR Speech at Siddipet Praja Ashirwada Sabha : 'ఈ ఎన్నికల్లో లక్ష మెజార్టీ రికార్డును సిద్దిపేట ప్రజలు బద్దలుకొట్టాలి'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.