నాగార్జునసాగర్ నియోజకవర్గంలో భాజపా టికెట్ ఆశిస్తున్న బీసీ నేత కడారి అంజయ్య యాదవ్ మూడు వేల మందితో పెద్ద ఎత్తున బైక్ ర్యాలీ చేపట్టారు. పెద్దవుర నుంచి హాలియాకు చేరుకుని అక్కడ ఉమ్మడి జిల్లా స్థాయి కబడ్డీ పోటీలను ఆయన ప్రారంభించారు. క్రీడల వల్ల మానసిక ఉల్లాసంతో పాటు ఆరోగ్యంగా ఉండటానికి అవకాశం ఉందని ఆయన వెల్లడించారు.
రాష్ట్రంలో దొరల పెత్తనం చెల్లదని భాజపా నేత కడారి అంజయ్య యాదవ్ అన్నారు. రాబోయే ఎన్నికల్లో రాష్ట్రంలో భాజపా అధికారంలోకి వస్తుందన్నారు. దేశంలో మోదీ పాలన మెచ్చి యువత ముందుకు వస్తున్నారని ఆయన పేర్కొన్నారు. రాష్ట్రంలో భాజపాకి రోజురోజుకీ మద్దతు పెరుగుతుందని ఆయన వివరించారు. ఈ కార్యక్రమంలో భాజపా జిల్లా మాజీ అధ్యక్షులు నూకల నర్సింహారెడ్డి, ఇతర నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
ఇదీ చూడండి : రుణ యాప్‌ల వ్యవహారంలో మరో ముగ్గురి అరెస్టు