Bandi on munugode bypoll మునుగోడు ప్రజల కోసమే రాజగోపాల్‌రెడ్డి రాజీనామా చేశారని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పేర్కొన్నారు. తెరాస అభ్యర్థితో కలిసి ప్రచారంలో పాల్గొనడానికి తెరాస పెద్దలే ఇబ్బంది పడుతున్నారని వెల్లడించారు. మునుగోడులో కేసీఆర్ ఇచ్చిన హామీలు ఒక్కటైనా నెరవేర్చారా? అని ప్రశ్నించారు. మునుగోడు ప్రజలు వివేకంతో ఆలోచించాలని సూచించారు. మునుగోడు ఎన్నిక రాష్ట్ర భవిష్యత్తును నిర్ణయిస్తుందని స్పష్టం చేశారు.
''ఒక్క ఉపఎన్నిక కోసం... కేసీఆర్ ఇన్ని చిల్లర రాజకీయాలు చేస్తున్నారు. ఇక జాతీయ రాజకీయాల్లోకి వస్తే ఎట్లా ఉంటుంది. ఈ చిల్లర రాజకీయాలు మానుకో కేసీఆర్... అభివృద్ధిపైన దృష్టి పెట్టు.. అంతే కానీ ఈ చిల్లర రాజకీయలు ఎందుకు. ఎమ్మెల్యేలు కోనుగోలు కోసం డబ్బులు పంచామని ఆరోపిస్తున్నారు... అసలు ఎవరో తెలియదు వాళ్లు భాజపా అని అంటున్నారు. వాళ్లు కచ్చితంగా తెరాసనే ''- బండి సంజయ్
Bandi on trying buy a trs mlas issue ఇదిలా ఉంటే... రాష్ట్రంలో హాట్ టాపిక్‌గా మారిన తెరాస ఎమ్మెల్యేల కొనుగోలుపై బండి ఫైర్ అయ్యారు. ఇది అంతా కేసీఆర్ అల్లిన స్క్రీప్ట్ అని ఆరోపించారు. అన్ని ఛానళ్లలో భాజపా అని చెప్తున్నారు... మీడియాతో కేసీఆర్ చెప్పిస్తున్నారని అభిప్రాయం వ్యక్తం చేశారు. తాను రేపు యాదాద్రికి వెళ్తానని... దమ్ముంటే కేసీఆర్ కూడా రావాలని బండి సంజయ్ సవాల్ విసిరారు. యాదాద్రి లక్ష్మీ నరసింహ స్వామి ముందట ప్రమాణం చేద్దామని అన్నారు. ఈ విషయంపై కోర్డును ఆశ్రయిస్తామని వెల్లడించారు. తమ పార్టీ న్యాయ పరంగా ముందుకు వెళ్తుందని తెలిపారు. ఈ వ్యవహారంపై సీబీఐ విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు.
''తెరాస ఎమ్మెల్యేల కొనుగోలు విషయం నిజమే అయితే ముఖ్యమంత్రి కేసీఆర్ యాదగిరిగుట్ట లక్ష్మినరసింహస్వామిపై ప్రమాణం చేయాలి. ఉపఎన్నికలో ఓటమి తప్పదనే భయంతో ప్రజల దృష్టిని మరచ్చేందుకు ఎమ్మెల్యేల కొనుగోలు అంశాన్ని కేసీఆర్ తెరపైకి తెచ్చారు. డబ్బులు పట్టుబడితే... ఎందుకు బయటపెట్టలేదు. మెయినాబాద్ ఫామ్‌హౌస్ సీసీ ఫుటేజ్ సహా సీఎం కేసీఆర్ కాల్ లిస్ట్ బయటపెట్టాలి. భాజపాపై దుష్ప్రచారం చేస్తున్న తెరాసను వదలిపెట్టబోం... ఎమ్మెల్యేల కొనుగోలు అంశంపై న్యాయపోరాటం చేస్తాం.'' -బండి సంజయ్
ఇవీ చూడండి: