తెలంగాణ రాష్ట్రంలో తెరాసకు ప్రత్యామ్నాయం భాజపాయేనని ఆ పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు కాసం వెంకటేశ్వర్లు పేర్కొన్నారు. నాగర్‌కర్నూల్ జిల్లా కేంద్రంలోని ఓ ఫంక్షన్ హాల్లో ఏర్పాటుచేసిన నియోజకవర్గ స్థాయీ భాజపా కార్యకర్తల సభ్యత్వ నమోదు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కాంగ్రెస్ పార్టీ కథ సమాప్తమైందని తెరాస ప్రభుత్వ హయాంలో అధికారులు అవినీతిపరులుగా మారారని ధ్వజమెత్తారు. స్థానిక శాసనసభ్యులు ఐదేళ్లలో చేసిన హామీలు ఏమీ నెరవేరలేదని పేర్కొన్నారు. రాష్ట్రాన్ని అప్పుల తెలంగాణగా మార్చిన ఘనత కేసీఆర్‌కే దక్కిందని మండిపడ్డారు. కార్యక్రమంలో అసెంబ్లీ ఇంఛార్జీ లీపాచారి, భాజపా జిల్లా అధ్యక్షుడు బూసి రెడ్డి సుబ్బారెడ్డి పాల్గొన్నారు.
అప్పుల తెలంగాణగా మార్చారు: భాజపా
నాగర్‌కర్నూల్ జిల్లాలో భాజపా సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో రాష్ట్ర ఉపాధ్యక్షులు కాసం వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. రాష్ట్రాన్ని కేసీఆర్ అప్పుల తెలంగాణగా మార్చారని విమర్శించారు.