నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ నియోజకవర్గంలో రెండు రోజుల నుంచి కురుస్తున్న వర్షాలకు కుంటలు, చెరువులు నిండిపోయాయి. కొల్లాపూర్ మండలం ముక్కిడిగుండం ఉడుముల వాగు, నార్లాపూర్ గ్రామ పరిధిలోని పెద్దవాగు వరద నీటి ప్రవాహంతో ఉద్ధృతంగా ప్రవహిస్తున్నాయి.
వాగు ప్రవాహ వేగానికి పలుచోట్ల రోడ్లు కోతకు గురయ్యాయి. పెంట్లవెల్లి మండలంలోని మాడవస్వామి నగర్ వెళ్లే దారిలో వాగు ప్రవాహానికి రాకపోకలు నిలిచిపోయాయి. వీపనగండ్ల మండల కేంద్రంలో చెరువు నిండి పొలాల్లోకి వరద నీరు చేరింది. మండలంలోని చౌట చెరువు పూర్తిగా నిండి.. రోడ్డుపై పారుతోంది. నియోజకవర్గంలోని పలు రోడ్లు కోతకు గురయ్యాయి. కొల్లాపూర్లో చుక్కాయిపల్లి చెరువు నిండి అలుగు పారుతోంది.
ఇదీ చదవండిః చెట్టుపై ఉండగా గుండెపోటు.. గీత కార్మికుడు మృతి