నాగర్‌కర్నూల్ జిల్లా లింగాల మండలం దారారం గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. కరోనా సోకి ఓ వ్యక్తి మృత్యువాతపడ్డాడు. కొవిడ్ పాజిటివ్‌గా నిర్ధారణ కావడంతో గత వారం రోజులుగా హోం ఐసోలేషన్‌లో ఉంటూ చికిత్స పొంతున్నాడు.
సోమవారం తీవ్ర అస్వస్థతకు గురై మరణించాడు. అంత్యక్రియలు నిర్వహించేందుకు బంధువులు ఎవరూ ముందుకు రాకపోవడంతో గ్రామ సర్పంచ్ కవితా శ్రీనివాసులు పంచాయతీ సిబ్బంది, మృతుని కుటుంబసభ్యులతో కలిసి కరోనా నిబంధనలు పాటిస్తూ దహన సంస్కారాలు నిర్వహించారు. మృతునికి భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.
ఇదీ చదవండి: కరోనా పరిస్థితిపై హైకోర్టులో నేడు అత్యవసర విచారణ