నాగర్కర్నూల్ జిల్లా కోడేరు మండల కేంద్రంలో జిల్లా కలెక్టర్ ఎల్.శర్మన్ ఆకస్మిక తనిఖీ చేపట్టారు. గ్రామంలో పారిశుద్ధ్యం, హరితహారం, మరుగుదొడ్లు, రైతు వేదిక, స్మశాన వాటికను జిల్లా పాలనాధికారి పరిశీలించారు. పారిశుద్ధ్యం, హరితహారం కార్యక్రమాల నిర్వహణపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.
ఆగస్టు 14వ తేదీన మళ్లీ గ్రామాన్ని సందర్శిస్తానని.. గ్రామంలో మార్పు లేకుంటే చర్యలు తప్పవన్నారు. మండలంలో కొనసాగుతున్న పల్లె ప్రగతి అభివృద్ధి నివేదికతో సాయంత్రం 4 గంటలకు కలెక్టర్ కార్యాలయానికి రావాలని ఎంపీడీవోను ఆదేశించారు. అనంతరం కోడేరు మండలం పసుపుల గ్రామంలో పర్యటించారు.
ఇవీ చూడండి: కొవిడ్ రెస్పాన్స్ అంబులెన్సులు ప్రారంభించిన కేటీఆర్, ఈటల