ETV Bharat / state

ఊర్కొండ మండలంలో కలెక్టర్ ఆకస్మిక​ పర్యటన!

నాగర్ కర్నూల్ జిల్లా ఊర్కొండ మండలంలో జిల్లా కలెక్టర్ శర్మన్ పర్యటించారు. మండల కేంద్రంతో పాటు.. పలు గ్రామాల్లో కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. రైతు వేదికల భవన నిర్మాణాలను, పల్లె ప్రగతిలో జరిగిన పలు అభివృద్ధి కార్యక్రమాలను కలెక్టర్ పరిశీలించారు.

Nagar Karnool Collector Sharman Sudden visit In Urkonda Mandal
ఊర్కొండ మండలంలో కలెక్టర్ ఆకస్మిక​ పర్యటన!
author img

By

Published : Aug 28, 2020, 12:08 PM IST

నాగర్ కర్నూల్ జిల్లా ఊర్కొండ మండలంలో జిల్లా కలెక్టర్ శర్మన్​ ఆకస్మికంగా పర్యటించారు. మండలకేంద్రంతో పాటు మండలంలోని ఉర్కొండపేట, రాచాలపల్లి, మాదారం, బొమ్మరాజుపల్లి గ్రామాల్లో కలెక్టర్ తనిఖీ చేశారు. పల్లెప్రగతిలో చేపట్టిన పలు కార్యక్రమాలను, రైతు వేదిక భవన నిర్మాణాలను ఆయన పరిశీలించి.. పలు సూచనలు చేశారు. నిర్దేశించిన ప్రకారం గ్రామాల్లో చేపట్టాల్సిన పనులు వేగంగా పూర్తి చేయాలని, పనుల్లో ఎలాంటి అలసత్వానికి తావివ్వకూడదని ఆదేశించారు. ప్రజాప్రతినిధులు, మండలస్థాయి, గ్రామస్థాయి అధికారులు కష్టపడి పని చేయాలన్నారు.

పనుల్లో జాప్యం చేస్తే అధికారులపై, ప్రజాప్రతినిధులపై చర్యలు తీసుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు. ఊర్కొండ మండలంలో జరిగిన పనుల పట్ల అసంతృప్తి వ్యక్తం చేసిన కలెక్టర్ డీఎల్పీవో పండరీనాథ్, ఎంపీడీవో ప్రభాకర్, ఎంపీవో వెంకటేశ్వర్లు, ఊర్కొండ సర్పంచ్​ రాజయ్య, గ్రామ కార్యదర్శి హరికృష్ణలకు షోకాజ్ నోటీసులను జారీ చేయాలని అధికారులు ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఆయా గ్రామాల ప్రజాప్రతినిధులు, అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

ఇవీ చూడండి: పారిశ్రామిక పార్కులకు కేంద్ర సహకారం కావాలి: కేటీఆర్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.