ETV Bharat / state

మూడో రోజు కొనసాగుతోన్న రేవంత్ రెడ్డి పాదయాత్ర - తెలంగాణ వార్తలు

ఎంపీ రేవంత్​రెడ్డి పాదయాత్ర మూడో రోజు కొనసాగుతోంది. ఈ పాదయాత్ర డిండిచింతపల్లి నుంచి పోల్కంపల్లి గ్రామాల మధ్య సాగుతోంది. పాదయాత్రలో మాజీ ఎంపీ మల్లు రవి, మాజీ ఎమ్మెల్యే వంశీకృష్ణ, కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు తదితరులు పాల్గొని మద్దతు తెలిపారు.

mp Revanth Reddy Padayatra for the third day between dindi chinthapalli and polkampally
మూడో రోజు కొనసాగుతోన్న రేవంత్ రెడ్డి పాదయాత్ర
author img

By

Published : Feb 9, 2021, 7:10 PM IST

నాగర్​కర్నూలు జిల్లా అచ్చంపేట నుంచి హైదరాబాద్​కు టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, ఎంపీ రేవంత్​ రెడ్డి చేపట్టిన రాజీవ్​ రైతు భరోసా యాత్ర మూడో రోజు కొనసాగుతోంది. వంగూరు మండలం డిండిచింతపల్లి నుంచి పోల్కంపల్లి గ్రామాల మధ్య పాదయాత్ర సాగుతోంది.

మహేంద్ర రైతులు, వివిధ గ్రామాల ప్రజలు, యువజన సంఘాల సభ్యులు అధిక సంఖ్యలో పాల్గొని మద్దతు తెలిపారు. పాదయాత్రలో మాజీ ఎంపీ మల్లు రవి, మాజీ ఎమ్మెల్యే వంశీకృష్ణ, కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

కేంద్రం తీసుకొచ్చిన చట్టాలకు వ్యతిరేకంగా, రైతులకు అండగా ఉండేందుకు రాష్ట్రంలో పాదయాత్ర నిర్వహించాలని సీతక్క సహా పార్టీ నాయకులు రేవంత్ రెడ్డిని కోరారు. పార్టీ నేతలు, ప్రజల నిర్ణయం మేరకు రైతు భరోసా దీక్షను.. రైతు భరోసా యాత్రగా మార్చుతున్నట్టు ఈ నెల 7న రేవంత్ రెడ్డి ప్రకటించారు.

ఇదీ చూడండి: రాష్ట్రంలో కొత్త బార్ల ఏర్పాటు దరఖాస్తుల గడువు పొడిగింపు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.