ETV Bharat / state

చెత్తచెదారాన్ని తొలగించేందుకు శ్రమదానం చేసిన ఎమ్మెల్యే, కలెక్టర్​ - nagarkurnool district news

నాగర్​కర్నూల్​ జిల్లా సోమశిల గ్రామంలో కొల్లాపూర్​ ఎమ్మెల్యే హర్షవర్ధన్​రెడ్డి, జిల్లా కలెక్టర్​ శర్మన్​ పర్యటించారు. సోమశిల పుణ్యక్షేత్రం ఎంతో పవిత్రమైనదని.. ప్రజలు గ్రామాన్ని శుభ్రంగా ఉంచుకోవాలన్నారు. టూరిజం శాఖ కాటేజీలను పరిశీలించి.. చెత్తచెదారం తొలగించేందుకు శ్రమదానం చేశారు.

mla and collector visited somasila village in nagarkurnool district
చెత్తచెదారాన్ని తొలగించేందుకు శ్రమదానం చేసిన ఎమ్మెల్యే, కలెక్టర్​
author img

By

Published : Aug 27, 2020, 5:34 PM IST

నాగర్​కర్నూల్ జిల్లా కొల్లాపూర్ మండలం సోమశిల గ్రామంలో ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి, జిల్లా కలెక్టర్ ఎల్​.శర్మన్​ ఆకస్మికంగా పర్యటించారు. గ్రామంలో పారిశుద్ధ్య పనులు, డంపింగ్ యార్డ్ నిర్మాణ పనులను పరిశీలించారు. అనంతరం టూరిజం శాఖ కాటేజీలను పరిశీలించి... చెత్తాచెదారం తొలగించేందుకు శ్రమదానం చేశారు. సోమశిల పుణ్య క్షేత్రం ఎంతో పవిత్రమైనదని... ప్రజలు గ్రామాన్ని శుభ్రంగా ఉంచుకోవాలని ఎమ్మెల్యే సూచించారు. కాటేజీల చుట్టూ అపరిశుభ్రంగా ఉంటే నిర్వాహకులపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

అధికారులు గ్రామాల్లో పర్యటించి పారశుద్ధ్య పనులను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని సూచించారు. డంపింగ్ యార్డ్​లో మురుగు నీరు నిలవకుండా గుంతలను మట్టితో నింపాలని చెప్పారు. దోమలు నిల్వ ఉండకుండా బ్లీచింగ్ పౌడర్​ చల్లాలని సూచించారు. సీజనల్ వ్యాధుల పట్ల గ్రామస్థులు జాగ్రత్తగా ఉండాలన్నారు. అనంతరం బోటులో కృష్ణా నదిలో పర్యటించారు.

ఇవీ చూడండి: ఈటీవీ రజతోత్సవం.. చంద్రబాబు శుభాకాంక్షలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.