కేంద్రంలో కాంగ్రెస్, భాజపా మధ్యనే ఎన్నికల పోరు జరుగుతోందని నాగర్కర్నూల్ కాంగ్రెస్ అభ్యర్థి మల్లు రవి అన్నారు. తెరాసను గెలిపిస్తే హస్తినాకు వెళ్లి మోదీ దగ్గర జీ హుజూర్ అనాల్సిందే తప్ప చేసేదేమీ లేదని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ పార్టీ అధికారం లోకి వచ్చిన వెంటనే హామీలన్నీ నెరవేర్చుతామన్నారు. కార్యక్రమంలో వనపర్తి మాజీ ఎమ్మెల్యే చిన్నారెడ్డి, అలంపూర్ మాజీ ఎమ్మెల్యేలు చల్లా వెంకట్రామిరెడ్డి, సంపత్ కుమార్, గద్వాల్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు ప్రభాకర్ రెడ్డి పాల్గొన్నారు.
ఇదీ చదవండి:హైదరాబాద్ ఇమేజ్ తగ్గిపోయింది: రేవంత్