పౌరసత్వ సవరణ బిల్లుపై రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. బిల్లును ఉభయ సభల్లో ఉపసంహరించాలంటూ నాగర్కర్నూల్ జిల్లా కేంద్రంలో వామపక్షాలు ఆందోళనకు దిగాయి.
మోదీ సర్కార్ ఓటు బ్యాంకు రాజకీయాల కోసమే ఇలాంటి బిల్లు ప్రవేశపెట్టిందని వామపక్ష నేతలు ఆరోపించాయి. ముస్లింలపై కక్షపూరితంగా వ్యవహరిస్తోందని విమర్శించారు. లౌకిక రాజ్యంలో భాజపా ప్రభుత్వం చిచ్చు పెడుతోందని మండిపడ్డారు.