నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలో జనసేన పార్టీ ఆరో వార్షికోత్సవం సందర్భంగా పార్టీ కార్యాలయంలో కేక్ కట్ చేసి ఘనంగా వేడుకలు జరిపారు. జనసేన ఆంధ్రా పార్టీ కాదని, రాష్ట్రంలో ఎదుర్కొంటున్న అనేక ప్రజా సమస్యలపై పోరాడిందని నాగర్ కర్నూల్ జిల్లా జనసేన ప్రధాన కార్యదర్శి వంగా లక్ష్మణ్ గౌడ్ పేర్కొన్నారు.
రైతుల సమస్యలపై పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ స్పందించిన తర్వాత ప్రభుత్వం సమస్యలు పరిష్కరించిందన్నారు. ఈ ఏడాది బడ్జెట్లో పాలమూరు రంగారెడ్డి పథకానికి రూ. 380 కోట్లు మాత్రమే కేటాయించారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రాజెక్టు ఎప్పుడు పూర్తవుతుందని ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
ఇదీ చూడండి : గొర్రెల పంపిణీలో జాప్యం.. 16న రోడ్ల దిగ్బంధనం