ETV Bharat / state

'సృజనాత్మకతను ప్రోత్సహించడానికి ఇంటింటా ఇన్నోవేటర్' - నాగర్​కర్నూల్ జిల్లా అదనపు కలెక్టర్​ మను చౌదరి వార్తలు

ప్రజల్లో సృజనాత్మకతను ప్రోత్సహించడానికి ఇంటింటా ఇన్నోవేటర్​ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని జిల్లా అదనపు కలెక్టర్​ మను చౌదరి పేర్కొన్నారు. ఏ రంగానికి చెందిన వారికైనా తమ సృజనాత్మకతను బయటకు తీసేందుకు ఇది మంచి అవకాశం అని తెలిపారు.

Intinta Innovator to Promote Creativity
'సృజనాత్మకతను ప్రోత్సహించడానికి ఇంటింటా ఇన్నోవేటర్'
author img

By

Published : Jul 11, 2020, 8:16 AM IST

నాగర్​కర్నూల్ జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయంలో అదనపు పాలనాధికారి మను చౌదరి సమీక్ష సమావేశం నిర్వహించారు. జిల్లా విద్యాశాఖ అధికారి గోవిందరాజులు, జిల్లా సైన్స్ అధికారి కృష్ణారెడ్డిలు పాల్గొన్నారు.

ఆగస్టు 15న స్వాతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా ఇంటింటా ఇన్నోవేటర్​ ఆన్​లైన్​ ఆవిష్కరణ ప్రదర్శన నిర్వహించడం జరుగుతుందని మను చౌదరి పేర్కొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో ఒకేసారి ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నామని తెలిపారు. జిల్లా ప్రజలు ఈ-ఆవిష్కరణలను సోషల్ మీడియా ద్వారా చూడవచ్చని తెలిపారు. ఇందులో గ్రామీణ ఆవిష్కరణలు, విద్యార్థుల ఆవిష్కరణలు, ప్రారంభ ఆవిష్కరణలు, సూక్ష్మ, చిన్న తరహా పరిశ్రమల ఆవిష్కరణలు ప్రదర్శించవచ్చని తెలిపారు.

ఇవీ చూడండి: రాష్ట్రంలో కొత్తగా 1278 కేసులు.. మరో 8 మంది మృతి

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.