నాగర్కర్నూల్ జిల్లా కేంద్రంలోని మున్సిపాలిటీలో ఓ మహిళ పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించింది. తన సొంత భూమిలో ఇతర వ్యక్తులు దౌర్జన్యంగా అధికారుల అండదండలతో భవనాన్ని నిర్మిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేసింది. తనకు అన్యాయం జరిగిందని ఆ మహిళ మున్సిపాలిటీ కార్యాలయం చేరుకుని మందు డబ్బాతో ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. వెంటనే గమనించిన స్థానిక సిబ్బంది అడ్డుకుని డబ్బా లాక్కున్నారు. టౌన్ ప్లానింగ్ అధికారులు అండగా ఉండి ఆ భవనాన్ని నిర్మించేందుకు సహకరిస్తున్నారని మహిళ గగ్గోలు పెట్టింది.
తానూ ఎన్నిసార్లు అధికారులకు మొరపెట్టుకున్నా ఒక్కరూ కూడా పట్టించుకోవడం లేదని ఆందోళన చేసింది. ఆ ప్లాటు విషయంలో కోర్టులో కేసు తమకు అనుకూలంగా తీర్పు వచ్చిందని అన్నారు. అయినా కూడా వినిపించుకోకుండా దౌర్జన్యంగా భవనం నిర్మిస్తున్నారని విలపించారు. తనకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. అధికారులు కలుగజేసుకుని న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు.
ఇదీ చూడండి : పెట్రోల్ బంక్ వద్ద ఘర్షణ.. సీసీ కెమెరాల్లో రికార్డు