నాగర్కర్నూల్ జిల్లా కోడేరు మండల రెవెన్యూ కార్యాలయం వద్ద రైతు ఆత్మహత్యాయత్ననికి పాల్పడ్డాడు. కోడెర్ మండలం రాజపూర్ గ్రామానికి చెందిన రైతు వెంకటయ్య తన తండ్రి పేరున సర్వే నెంబర్ 200, 207, 213లో 2.16 ఎకరాల పొలం ఉంది. తమ భూమిని ఆన్లైన్లో ఎక్కించాలని గత సంవత్సరం నుంచి అధికారుల చుట్టూ తిరుగుతున్నా పట్టించుకోవడం లేదని రైతు ఆరోపించారు. 2.16 ఎకరాల భూమికి కేవలం 16 గుంటల భూమిని ఆన్లైన్లో ఎక్కించి చేతులు దులుపుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఏడాది నుంచి రెవెన్యూ అధికారుల చుట్టూ తిరుగుతున్నా పట్టించుకోకపోవడం వల్ల కార్యాలయం వద్ద పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు.
దీంతో చుట్టుపక్కల ఉన్న రైతులు అడ్డుకొని కార్యాలయం ముందు ఆందోళనకు దిగారు. ఘటనాస్థలికి పోలీసులు చేరుకొని సమస్యను పరిష్కరించేలా చూస్తామని చెప్పి ఆందోళన విరమింపజేశారు. ఏళ్ల తరబడి రెవెన్యూ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నా పట్టించుకోవడం లేదని రైతులు ఆరోపించారు.
ఇవీ చూడండి: విద్యుదాఘాతంతో వ్యవసాయ కోడె మృతి