ETV Bharat / state

ఎల్​ఆర్ఎస్ రద్దు చేయాలంటూ నిరసన - ఎల్​ఆర్ఎస్ రద్దు చేయాలంటూ ధర్నా

ఎల్​ఆర్ఎస్​ను రద్దు చేయాలంటూ దస్తావేజు లేఖరులు, స్థిరాస్తి వ్యాపారులు నిరసన చేపట్టారు. నాగర్​కర్నూల్​ జిల్లా కల్వకుర్తిలోని సబ్​ రిజిస్ట్రార్​ కార్యాలయం ముందు ఆందోళన నిర్వహించారు. గేటుకు తాళం వేసి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

document writers and real estate holders dharna at nagar kurnool dist kalwakurthy sub registrar office
ఎల్​ఆర్ఎస్ రద్దు చేయాలంటూ నిరసన
author img

By

Published : Dec 24, 2020, 5:43 PM IST

నాగర్​కర్నూల్​ జిల్లా కల్వకుర్తిలో రిజిస్ట్రేషన్ కార్యాలయం ముందు స్థిరాస్తి వ్యాపారులు, దస్తావేజు లేఖరులు ఆందోళన నిర్వహించారు. ఎల్​ఆర్ఎస్​ను రద్దు చేయాలంటూ కార్యాలయానికి తాళం వేసి నిరసన వ్యక్తం చేశారు. రిజిస్ట్రేషన్ ప్రక్రియను పాత పద్ధతిలోనే కొనసాగించాలని డిమాండ్​ చేశారు.

ఎల్ఆర్ఎస్ వల్ల పేద కుటుంబాల మీద అధిక భారం పడుతోందన్నారు. కరోనాతో తొమ్మిది నెలలుగా ఉపాధి లేక ఇబ్బందులు పడుతున్నామని వాపోయారు. సమాచారం అందుకున్న ఆర్డీవో రాజేశ్​కుమార్, ఎస్సై మహేందర్ ఆందోళన విరమించాలని​ నిరసనకారులకు సర్దిచెప్పారు. ధర్నా విరమించిన అనంతరం ఆర్డీవోకు వినతి పత్రం అందజేశారు.

ఇదీ చూడండి:'పాతబస్తీలో సంఘవిద్రోహ శక్తులను 15 నిమిషాల్లో గుర్తించొచ్చు'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.