ETV Bharat / state

ఆస్పత్రిలో కలెక్టర్ల ఆకస్మిక తనిఖీ.. - నాగర్​కర్నూలు ఆస్పత్రిని సందర్శించిన చౌహాన్​

నాగర్ కర్నూల్ జిల్లా ప్రభుత్వాసుపత్రిలో ఆక్సిజన్​ ప్లాంటును తక్షణమే ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్​ సూచించారు. జిల్లా ఆస్పత్రిని కలెక్టర్​ శర్మన్​ చౌహన్​, అదనపు​ కలెక్టర్​ ఆకస్మికంగా తనిఖీ చేశారు.

నాగర్​కర్నూల్​ వార్తలు
ప్రభుత్వాసుపత్రిలో కలెక్టర్​ తనిఖీలు
author img

By

Published : May 6, 2021, 3:18 PM IST

నాగర్​ కర్నూల్​ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వాసుపత్రిని కలెక్టర్​ ఎల్​.శర్మన్​ చౌహన్​ ఆకస్మికంగా తనిఖీ చేశారు. కొవిడ్​ వార్డులో డ్యూటీ డాక్టర్​ అందుబాటులో లేకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉదయం 7గంటల సమయంలో అదనపు కలెక్టర్​ తనిఖీ చేసిన సమయంలోను వైద్యులు లేకపోవడంపై అసహనం వ్యక్తం చేశారు.

ఆక్సిజన్​ మానిటరింగ్​ను అటెండర్స్​ చేయడం ఏమిటని ప్రశ్నించారు. విధుల పట్ల అలసత్వం ప్రదర్శిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఆస్పత్రి వద్ద ఆక్సిజన్ ప్లాంట్ ఏర్పాటుకు వెంటనే చర్యలు తీసుకోవాలన్నారు. వారం పది రోజుల్లో పనులు పూర్తి చేయాలని సూచించారు.

ఇదీ చూడండి: ప్రగతి భవన్‌ వద్ద నర్సింగ్‌ అభ్యర్థుల ఆందోళన

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.