ETV Bharat / state

ఓటర్ల జాబితాలో తప్పులపై నేతల అభ్యంతరం - ఓటర్ల జాబితాలో తప్పులపై నేతల అభ్యంతరం

కల్వకుర్తి పురపాలక సంఘం పరిధిలోని ఓటర్ల జాబితాలో తప్పుడు దొర్లాయంటూ వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు.. అధికారులను నిలదీశారు. మరణించిన వ్యక్తులు, పక్క వార్డుల ఓటర్లు జాబితాలో ఉన్నారని ఫిర్యాదుచేశారు.

muncipal elections
ఓటర్ల జాబితాలో తప్పులపై నేతల అభ్యంతరం
author img

By

Published : Jan 1, 2020, 11:38 PM IST

నాగర్​కర్నూల్​ జిల్లా కల్వకుర్తి పురపాలక సంఘం పరిధిలోని ఓటర్ల జాబితాలో తప్పులు దొర్లాయని పలు పార్టీలకు చెందిన నేతలు.. ఇంఛార్జ్​ కమిషనర్​ బాలచంద్రసృజన్​, ఎన్నికల అధికారి సత్యనారాయణ దృష్టికి తీసుకువచ్చారు. పురపాలక సంఘం సమావేశ మందిరం నిర్వహించిన అవగాహన సదస్సులో అధికారులను నిలదీశారు. మరణించిన వ్యక్తులు, పక్క వార్డుల ఓటర్లు ఉన్నారని ఫిర్యాదు చేశారు. ఒకే కుటుంబానికి చెందిన సభ్యుల ఓట్లు వేర్వేరు వార్డుల పరిధిలో ఉన్నాయన్నారు.

నేతల అభ్యంతరాలతో అవగాహన సదస్సు కాస్త గందరగోళంగా మారింది. అభ్యంతరాలు ఉన్నవారు లిఖితపూర్వక ఫిర్యాదు ఇవ్వాలని అధికారులు సూచించారు. పరిశీలించి జాబితా సరిచేస్తామని హామీ ఇచ్చారు.

ఓటర్ల జాబితాలో తప్పులపై నేతల అభ్యంతరం

ఇవీచూడండి: మున్సిపల్ ఎన్నికలపై హైకోర్టును ఆశ్రయించిన కాంగ్రెస్

Intro:tg_mbnr_03_01_municipality_votarlistlo_thappulu_avb_ts10130
నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి పురపాలక సంఘం ఎన్నికల్లో భాగంగా గా ఓటర్ జాబితా లో వార్డు లోని వ్యక్తులు ఓటర్ల సంఖ్య, రిజర్వేషన్లలో తప్పులు దొర్లాయని వివిధ పార్టీలకు చెందిన నాయకులు ఓటర్లు ఆందోళన చేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పురపాలిక ఎన్నికల సందర్భంగా విడుదల చేసిన ఓటర్ల జాబితాలో ఒక వార్డ్ లో అత్యధిక ఓటర్లు ఓటర్లు ఉండడమే, కాకుండా గత ఎన్నికల్లో వివిధ వార్డుల్లో ఉన్న ఓటర్లు ఇతర వార్డులో దర్శనమిచ్చాయి అని, ఇందులో అత్యధికంగా చనిపోయిన వ్యక్తుల ఓట్లు ఉన్నాయని ఇన్చార్జి కమిషనర్ బాలచంద్రసృజన్, ఎన్నికల అధికారి సత్యనారాయణ దృష్టికి తీసుకొచ్చారు.

Body:పురపాలిక సంఘం పరిధిలో 22 వార్డులకు గాను వివిధ వార్డుల్లో పోటీ చేసేందుకు ప్రయత్నిస్తున్న నాయకుల ఓట్లు పోటీలో నిలిచేందుకు వీలులేకుండా ఇతర వార్డులు ఉన్నాయి అని వారు వాపోయారు. ఒకే కుటుంబానికి చెందిన ఓట్లు వివిధ వార్డుల్లో ఓటరు జాబితాలో ఉండడంతో సమస్యలు తలెత్తుతున్నాయని వారు అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. పురపాలిక సంఘం సమావేశ మందిరంలో నిర్వహించిన అవగాహన సదస్సు కాస్త గందరగోళంగా మారింది. ఇన్చార్జి కమిషనర్ బాలచంద్ర సృజన్ మాట్లాడుతూ అభ్యంతరాలు ఉన్నవారు లిఖితపూర్వకంగా రాసి ఇవ్వాలని, క్షేత్ర స్థాయిలో వివిధ వార్డుల్లో పరిశీలించి ఓటరు జాబితాలో దొర్లిన తప్పులను సరి చేసేందుకు అధికార యంత్రాంగం కృషి చేస్తుందని ఆయన ఈ ఆందోళన చేస్తున్న తెరాస, భాజపా, కాంగ్రెస్, ఎం ఐ ఎం పార్టీల నాయకులకు యువజన సంఘాల సభ్యులకు ఈ సందర్భంగా తెలియ జేశారు. ఈ కార్యక్రమంలో సీఐ సైదులు, ఎస్సై మహేందర్, పురపలిక సంఘం టౌన్ ప్లాన్ అధికారి విజయ్, ఏ ఈ జ్ఞానేశ్వర్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు

Conclusion:నామని హరిశ్
మోజోకిట్ నెం : 891
కల్వకుర్తి
సెల్ నెం : 9985486481

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.