ETV Bharat / state

World Heritage Day 2023: వేడుకలకు ముస్తాబైన రామప్ప.. స్పెషల్ అట్రాక్షన్​గా తమన్

World Heritage Day 2023: యునెస్కో గుర్తింపు పొందిన రామప్ప.. ప్రపంచ వారసత్వ వేడుకలకు ముస్తాబైంది. శిల్పం, వర్ణం, కృష్ణం పేరుతో జరిగే సాంస్కృతిక కార్యక్రమాలు.. ఈ సాయంత్రం వైభంగా జరగనున్నాయి. మంత్రులు శ్రీనివాస్ గౌడ్, ఎర్రబెల్లి దయాకర్‌రావు, సత్యవతి రాఠోడ్‌లతో పాటు పలువురు ముఖ్య అతిథులుగా పాల్గొననున్నారు. ఈ వేడుకల్లో ప్రముఖ కళాకారులు పాల్గొని ప్రదర్శనలతో అలరించనున్నారు.

World Heritage Day 2023 celebrations
World Heritage Day 2023 celebrations
author img

By

Published : Apr 18, 2023, 6:45 AM IST

Updated : Apr 18, 2023, 6:55 AM IST

World Heritage Day 2023: చారిత్రక సంపదకు చిరునామా ఓరుగల్లు నగరం. ఏకశిలానగరం నలువైపులా నిర్మించిన కాకతీయుల కట్టడాలు.. ఎన్నో శతబ్దాలుగా వారసత్వ సంపదగా విరాజిల్లుతున్నాయి. పర్యాటకుల మదిని దోస్తున్నాయి. నిత్యం శివ నామస్మరణతో మార్మోగే వేయిస్తంభాల గుడి.. సందర్శకులకు ఆధ్యాత్మిక అనుభూతిని కలగజేస్తుంది. వరంగల్ కోటను తిలకిస్తే.. నాటి కాకతీయుల ఘన చరిత్ర కళ్ల ముందు కదలాడుతుంది. కన్ను ఆర్పకుండా చేసే కాకతీయ కళా తోరణం గురించి మాటల్లో వర్ణించలేం. అందుకే ఇది రాష్ట్ర చిహ్నమైంది.

World Heritage Day 2023 celebrations: తనివి తీరని అద్భుత కళాకృతులకు, కాకతీయ కట్టడాలకు ఓరుగల్లు కేంద్రమైతే.. యునెస్కో గుర్తింపు పొందిన రామప్ప ఆలయం.. ఇందుకు కేంద్ర బిందువు అని చెప్పాలి. లక్షల సంఖ్యలో పర్యాటకుల మనస్సులో చెరగని ముద్ర వేసుకున్న ఈ ఆలయ విశిష్టత అంతా ఇంతా కాదు.

World Heritage Day 2023 celebrations at ramappa temple: ములుగు జిల్లా వెంకటాపురం మండలం పాలెంపేట గ్రామంలో పచ్చని పంట పొలాల నడుమ కొలువైన రామప్ప ఆలయం.. అపురూప శిల్పకళా సంపదకు చిరునామాగా చెప్పుకోవచ్చు. కాకతీయ చక్రవర్తి రేచర్ల రుద్రుడి హయాంలో క్రీస్తుశకం 1213లో నిర్మితమై.. మహా శిల్పి రామప్ప కళా నైపుణ్యంతో రామప్ప ఆలయం.. అద్భుతంగా, అపురూపంగా చరిత్రలో నిలిచిపోయింది. కఠిన శిలలపై కారుణ్యం ఒలకపోసే ప్రతిమలు.. సహజత్వంగా కనిపించే దేవతామూర్తులు.. మీటితే చాలు సంగీతం పలికే శిల్పాలు.. నీటిలో తేలియాడే రాళ్లతో నిర్మించిన ఆలయ పైకప్పు.. ఇలా ఎన్నెన్నో ప్రత్యేకతల సమాహారమైన రామప్ప యశస్సు.. యునెస్కో వారసత్వ గుర్తింపు పొందడంతో విశ్వవ్యాప్తమైంది.

ప్రపంచ వారసత్వ దినోత్సవం సందర్భంగా.. శిల్పం, వర్ణం, కృష్ణం పేరుతో నేడు నిర్వహించనున్న వేడుకలకు సంబంధించిన గోడ పత్రికలను మంత్రులు విడుదల చేశారు. వేడుకల్లో ప్రముఖ సంగీత దర్శకుడు తమన్, ప్రఖ్యాత డ్రమ్స్ కళాకారుడు శివమణిలతో సంగీత ప్రదర్శనలు ఏర్పాటు చేశారు. సుమారు 300 మందికి పైగా కళాకారులు ఈ వేడుకల్లో పాల్గొననున్నారు. సంప్రదాయ గిరిజన నృత్యాలు, రామప్ప వైభవంపై లేజర్ షో, కళాకారుల పేరణి నృత్యం.. ఇతర సాంస్కృతిక కార్యక్రమాలు.. ప్రేక్షకులను అలరించనున్నాయి. ఎక్కువ మంది సాంస్కృతిక కార్యక్రమాలు వీక్షించేందుకు వీలుగా.. హనుమకొండ, ములుగు నుంచి ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నడుపుతోంది. రామప్ప వారసత్వంపై వీడియో ప్రదర్శన సైతం ఏర్పాటు చేశారు.

వేడుకలకు ముస్తాబైన రామప్ప.. స్పెషల్ అట్రాక్షన్​గా తమన్

ఇవీ చూడండి..

Ramappa Temple News : 'ప్రసాద్' పథకంలో చేరిన రామప్ప ఆలయం

Ramappa Temple: రామప్ప ఆలయం విషయంలో యునెస్కో షరతుల అమలుకు చర్యలు

Last Updated : Apr 18, 2023, 6:55 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.