ములుగు జిల్లా తాడ్వాయి మండలంలో మేడారం జాతర అంగరంగ వైభవంగా జరుగుతోంది. వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్ జాతరలో పాల్గొని సమ్మక్క, సారలమ్మ వనదేవతలను దర్శించుకుని... మొక్కులు చెల్లించుకున్నారు.
రాష్ట్రం ఏర్పడ్డాక మేడారం జాతరలో ప్రభుత్వం ఎన్నో అభివృద్ధి పనులు చేసిందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు లేకుండా అధికారులు, ప్రజాప్రతినిధులు అన్ని చర్యలు తీసుకున్నారని వెల్లడించారు.
ఇదీ చదవండిః ఖైదీలను కళాకారులుగా మారుస్తున్న యువతి