ETV Bharat / state

నరసింహసాగర్ ఎదురుకాల్పుల్లో ఇద్దరు మావోల మృతి: ఎస్పీ

ములుగు జిల్లా మంగపేట మండలం నరసింహసాగర్ అటవీ ప్రాంతంలో ఈనెల 18న పోలీసులు, మావోయిస్టులకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో ఇద్దరు మావోయిస్టులు మృతి చెందినట్లు ఎస్పీ సంగ్రామ్ సింగ్ గణపతి పటేల్ తెలిపారు. ఘటనాస్థలిలో వారి నుంచి పుస్తకాలు, కిట్ బ్యాగ్స్ స్వాధీన పరుచుకున్నట్లు వెల్లడించారు.

author img

By

Published : Oct 19, 2020, 4:21 PM IST

two maoists died in mulugu district
నర్సింగాపూర్​లో ఇద్దరు మావోలు హతం

ములుగు జిల్లా మంగపేట మండలం నరసింహసాగర్​ అటవీ ప్రాంతంలో ఈనెల 18న పోలీసులు కూంబింగ్ నిర్వహించారు. ఈ క్రమంలో ముసలమ్మ గుట్ట సమీపంలోని గుత్తికోయ గుంపునకు నైరుతి దిశగా ఉన్న కొప్పుగుట్ట సమీపంలో మావోల సంచారం గమనించిన పోలీసులు కాల్పులు ప్రారంభించారు.

పోలీసులు, మావోయిస్టులకు మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో ఇద్దరు మావోయిస్టులు మృతి చెందినట్లు ములుగు ఎస్పీ సంగ్రామ్ సింగ్ గణపతి పటేల్ తెలిపారు. మృతులు వెంకటాపూరం మండలం జెల్లా గ్రామానికి చెందిన రవ్వ రాములు అలియాస్ సుధీర్​ (మణుగూరు ఏరియా కమాండర్), భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చెన్నాపురం గ్రామానికి చెందిన లక్మ (దళ సభ్యుడు)గా గుర్తించినట్లు వెల్లడించారు. కాల్పులు జరిగిన ప్రాంతంలో 1ఎస్​ఎల్​ఆర్, 2 ఎస్​బిబిఎల్, కొన్ని పుస్తకాలు, కిట్ బ్యాగ్స్, 2 ఏకే47, 16, 7.62 ఎంఎం గ్రౌండ్స్ స్వాధీనపరుచుకున్నట్లు పేర్కొన్నారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.