ములుగు జిల్లా ఏటూరునాగారం మండలం రామన్నగూడెం సమీపంలోని జీడి వాగు గత రెండ్రోజులుగా కురుస్తున్న వర్షానికి పొంగి పొర్లుతోంది. జీడి వాగు వద్ద లో- లెవెల్ బ్రిడ్జ్ ఉండేది. వాన పడినప్పుడు వరద నీరు ఎక్కువై గోదావరిలో కలవడం వల్ల రాంనగర్ తండా వాసులకు రాకపోకలు నిలిచిపోయేవి. ప్రజలు ఇబ్బందిపడకుండా ప్రభుత్వం హైలెవెల్ బ్రిడ్జి మంజూరు చేసింది. బ్రిడ్జి పనులు ఇంకా నిర్మాణంలోనే ఉండటం వల్ల రెండ్రోజులుగా కురుస్తున్న వానకు.. రాంనగర్, తండా గ్రామాల ప్రజలకు రాకపోకలు నిలిచిపోయాయి.
- ఇదీ చూడండి : భాగ్యనగరంలో తేలికపాటి చిరుజల్లులు