పీవీ నరసింహారావు కంతనపల్లి సుజల స్రవంతి ప్రాజెక్టు పరిధిలో గోదావరిపై ములుగు జిల్లా తుపాకులగూడెం వద్ద నిర్మిస్తున్న బ్యారేజీ కోసం అటవీ భూముల బదలాయింపునకు ప్రభుత్వం తుది అనుమతులిచ్చింది.
ఈ నిర్మాణం కోసం ఏటూరు నాగారం అటవీ డివిజన్‌లోని 27.9133 హెక్టార్ల భూమి అవసరం కావడంతో తదనుగుణంగా ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి డా.రజత్‌కుమార్ ఉత్తర్వులు జారీచేశారు.