ములుగు ఎమ్మెల్యే సీతక్కపై ఎన్నికల నియమావళి ఉల్లంఘన కేసు వీగిపోయింది. సరైన ఆధారాలు లేకపోవడం వల్ల ఆమెపై నమోదైన కేసును ప్రజాప్రతినిధుల కోర్టు కొట్టి వేసింది. హైదరాబాద్‌లోని ప్రజాప్రతినిధుల కోర్టులో గురువారం.. వేర్వేరు కేసుల్లో ప్రభుత్వ చీఫ్‌విప్ దాస్యం వినయభాస్కర్, ఎమ్మెల్యేలు రాజాసింగ్, జాఫర్ హుస్సేన్, జలగం వెంకట్రావు, ఎమ్మెల్సీ చిన్నపరెడ్డి, మాజీ ఎమ్మెల్సీ రాములు నాయక్ తదితరులు హాజరయ్యారు.
ఇవీచూడండి: 'మరీ..ఇంత దారుణమా..? మనము మనుషులమేనా'