ములుగు జిల్లా కేంద్రంలో ఏటా మినీ ట్యాంక్ బండ్లో బతుకమ్మ ఆట, దసరా సంబురాలు ఘనంగా జరిగేవి. కరోనా వ్యాప్తి వల్ల ఈ ఏడాది తోపుగుంటపై సద్దుల బతుకమ్మ పండుగ జరగకపోవడం వల్ల మహిళలు పురవీధుల్లో అక్కడక్కడ బతుకమ్మ పాటలు పాడుతూ కోలాటం ఆడారు.
కరోనా వైరస్ వల్ల ఏ క్షణాన ఏం జరుగుతుందోనని అధికారులు ముందుస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా తోపుగుంట వద్ద బతుకమ్మ ఆడటాన్ని నిషేధించారు. మహిళలు పురవీధుల్లో సంప్రదాయంగా బతుకమ్మ ఆటలు ఆడి, ఎవరికి వారే తీసుకెళ్లి బతుకమ్మలను గంగమ్మ ఒడికి చేర్చారు.