హరితహారం కార్యక్రమంలో భాగంగా ములుగు జిల్లాలో మొక్కలు నాటేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు. ములుగు జిల్లా వ్యాప్తంగా 9 మండలాల్లో 89.50 లక్షల మొక్కలు నాటాలని కలెక్టర్ నిర్ణయించారు. మొక్కలను నాటడానికి సిద్ధంగా ఉంచారు. ములుగు జిల్లా వ్యాప్తంగా డీఆర్‌డీఏ, అటవీశాఖల ఆధ్వర్యంలో 192 నర్సరీలలో 95.40 లక్షల మొక్కలు పెంచారు.
జిల్లా సాయిలో
మండలాల వారీగా ములుగులో 14.52 లక్షలు, వెంకటాపూర్‌లో 13.43 లక్షలు, గోవిందరావుపేటలో 13.28 లక్షలు, తాడ్వాయిలో 9.93 లక్షలు, ఏటూరునాగారంలో 13.63 లక్షలు, మంగపేటలో 9.76 లక్షలు, వెంకటాపురంలో 11.18 లక్షలు, వాజేడులో 10.45 లక్షల మొక్కలు పెంచారు. ఇందులో ప్రధానంగా టేకు మొక్కలు 14.92 లక్షలు, పండ్ల మొక్కలు 7.25 లక్షలు, పూల మొక్కలు 1.77 లక్షలు, ఇతర మొక్కలు 71.46 లక్షలు నాటాలని నిర్ణయించారు. అటవీశాఖ, డీఆర్‌డీఓ, ఉద్యానశాఖ, వ్యవసాయ శాఖలు ప్రధాన భూమిక పోషించాలని నిర్ణయించారు. జిల్లా సాయిలో నిర్దేశించిన లక్ష్యంలో భాగంగా వివిధ ప్రభుత్వ శాఖలకు కూడా లక్ష్యాలను నిర్దేశించారు.
శాఖల వారీగా పంపకం
ఇందులో డీఆర్‌డీఓకు 56.40 లక్షలు, అటవీశాఖ 3 లక్షలు, రెవెన్యూ 5 లక్షలు, పోలీసు 2 లక్షలు, ఎక్సైజ్ 50 వేలు, విద్యా 5 లక్షలు, ఏటూరునాగారం ఐటీడీఏ 4.54 లక్షలు, ఎస్సీ కార్పొరేషన్ 50 వేలు, గనుల 5 వేలు, ఉద్యాన 5 లక్షలు, వ్యవసాయ 5 లక్షలు, జిల్లా గిరిజనాభివృద్ధి 10 వేలు, పంచాయతీరాజ్ 40 వేలు, పశుసంవర్థక 5 వేలు, మత్స్య 15 వేలు, ఎస్సీ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ 10 వేలు, బీసీ సంక్షేమం వెయ్యి, రోడ్లు భవనాల 50 వేలు, జిల్లా సహకార శాఖ లక్ష మొక్కలు నాటాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా ఆయా ప్రభుత్వ శాఖల అధికారులు ప్రణాళికలు రూపొందిస్తున్నారు.
ఇదీ చూడండి : మలేరియాకు మన మందు!