ETV Bharat / state

కేంద్రం వల్లే గిరిజన వర్సిటీ ఆలస్యం: సత్యవతి రాథోడ్

భాజపా నిర్లక్ష్య ధోరణితో.. రెండేళ్ల క్రితమే ప్రారంభం కావాల్సిన 'కేంద్ర గిరిజన విశ్వవిద్యాలయం'.. ఇంకా మొదలు కాలేదంటూ మంత్రి సత్యవతి రాథోడ్​ మండిపడ్డారు. ములుగు జిల్లాలో పర్యటించి.. పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు.

Minister Satyavathi Rathore visits Mulugu district
ములుగు జిల్లాలో మంత్రి సత్యవతి రాథోడ్ పర్యటన
author img

By

Published : Jan 21, 2021, 2:04 PM IST

రాష్ట్ర గిరిజన, స్త్రీ, శిశు, సంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాథోడ్ ములుగు జిల్లాలో పర్యటించారు. జిల్లాలోని పలు అభివృద్ధి పనులను ఆవిడ ప్రారంభించారు.

ములుగు మండలం మల్లంపల్లిలో ఏర్పాటుచేసిన ప్రకృతి వనాన్ని మంత్రి ప్రారంభించారు. అనంతరం జిల్లాలోని గిరిజన యూనివర్సిటీకి కేటాయించిన భూమిని ఆమె పరిశీలించారు.

గిరిజన జనాభా అధికంగా ఉన్న కారణంతోనే.. కేంద్ర గిరిజన విశ్వవిద్యాలయానికి సీఎం కేసీఆర్​ ఈ ప్రాంతాన్ని ఎంచుకున్నారని మంత్రి పేర్కొన్నారు. యూనివర్శిటీ కోసం 350ఎకరాల భూమిని సర్వే చేసి సిద్ధంగా ఉంచామని తెలిపారు.

భాజపా నిర్లక్ష్య ధోరణితో.. రెండేళ్ల క్రితమే ప్రారంభం కావాల్సిన తరగతులు ఇంకా మొదలు కాలేదంటూ సత్యవతి మండిపడ్డారు. కేంద్రం మెడలు వంచైనా సరే త్వరితగతిన పనులు ప్రారంభించేలా పోరాటం చేస్తామని మంత్రి స్పష్టం చేశారు.

ఇదీ చదవండి: రికార్డు స్థాయిలో పల్లి ధర.. ఆనందంలో రైతన్న

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.