ETV Bharat / state

Heli Taxi At Medaram: మేడారం జాతరకు హెలికాప్టర్​లో వెళ్లొచ్చు!​ - మేడారం జాతర 2022

Heli Taxi At Medaram: మేడారం జాతరకు వెళ్లే భక్తుల కోసం పర్యాటక శాఖ హెలీరైడ్​ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చింది. హనుమకొండ ఆర్ట్స్​ కాలేజ్​ నుంచి మేడారం జాతరకు, జాతరలో ఏరియర్​ వ్యూ రైడ్​ చేసేందుకు భక్తులకు అవకాశం ఉంది.

Heliride At Medaram
Heliride At Medaram
author img

By

Published : Feb 11, 2022, 3:29 PM IST

Heli Taxi At Medaram: మేడారం జాతరకు వచ్చే భక్తుల కోసం పర్యాటక శాఖ హెలీరైడ్​ ఏర్పాటుచేస్తోంది. బెంగళూరుకు చెందిన తుంబి ఏవియేషన్ సంస్థ.. ఈ​ సర్వీసులను ఈనెల 13 నుంచి అందుబాటులోకి తీసుకొస్తుంది. హనుమకొండలోని ఆర్ట్స్​ కాలేజ్​ గ్రౌండ్​ నుంచి మేడారం వరకు రానుపోనూ ఒక్కొక్కరికి రూ.19,999గా నిర్ణయించినట్లు సంస్థ తెలిపింది. మేడారం జాతరలో ఏరియల్​ వ్యూ రైడ్​ కోసం ఒక్కొక్కరికి రూ.3,700 వసూలు చేయనున్నట్లు తెలిపింది. హెలికాప్టర్​ రైడ్​ బుకింగ్​ కోసం 9400399999, 9880505905, info@helitaxii.com ద్వారా సంప్రదించాలని కోరింది. మేడారం జాతరకు వచ్చే భక్తులు ఈ సౌకర్యాన్ని వినియోగించుకోవాలని ములుగు కలెక్టర్​ సూచించారు.

నాలుగు రోజుల పాటు..

ములుగు జిల్లాలో ఫిబ్రవరి 16 నుంచి 19 వరకు మేడారం మహాజాతర జరగనుంది. నాలుగు రోజుల పాటు జరిగే ఈ మహాజాతరకు రాష్ట్రం నలమూలల నుంచే కాకుండా ఏపీ, ఛత్తీస్‌గఢ్‌, ఒడిశా, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ రాష్ట్రాల నుంచి భక్తులు వస్తుంటారు. ఫిబ్రవరి 16న కన్నెపల్లి నుంచి సారలమ్మ, గోవిందరాజు, పగిడిద్దరాజులను.. 17న సమ్మక్క దేవతను గద్దెలపైకి తీసుకువస్తారు. 18న అమ్మవార్లకు భక్తులు మొక్కులు సమర్పించుకుంటారు. 19న పూజలు నిర్వహించిన అనంతరం సమ్మక్క, సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజులను వన ప్రవేశం చేయడంతో మహాజాతర ముగుస్తుంది.

మరోవైపు మహాజాతర ఏర్పాట్లు శరవేగంగా సాగుతున్నాయి. ప్రభుత్వం ఈసారి 75 కోట్లు వెచ్చించి భక్తులకు సకల సౌకర్యాలు కల్పించింది. కొవిడ్ దృష్ట్యా 30 వైద్య శిబిరాలను ఏర్పాటు చేసి.... వీటన్నింటికీ అనుసంధానంగా... తితిదే కల్యాణ మండపంలో... మెగా మెడికల్ క్యాంపును అధికారులు ఏర్పాటు చేశారు. గతంలో లేనంతగా... ఈ ఏడాది జనవరి మొదటివారం నుంచే భక్తుల సంఖ్య పెరగగా... ఈసారి కోటి 30 లక్షలకు పైగా భక్తులు దర్శించుకుంటారని అధికారులు అంచనా వేస్తున్నారు.

ఇదీచూడండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.